వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం సిద్దూ ఎఫెక్ట్: మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి రీ ఎంట్రీ, భారీ విరాళం, రాజకీయాల్లోకి !

దక్షిణ కన్నడ జిల్లాలోని కల్లడ్క శ్రీరామ పాఠశాల, కల్లూరు దేవాలయం దత్తతను కర్ణాటక ప్రభుత్వం రద్దు చెయ్యడంతో ఆ రాష్ట్ర మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జానర్దన్ రెడ్డి స్పందించారు. మంగళవారం కల్లడ్క చేరుక

|
Google Oneindia TeluguNews

మంగళూరు: దక్షిణ కన్నడ జిల్లాలోని కల్లడ్క శ్రీరామ పాఠశాల, కల్లూరు దేవాలయం దత్తతను కర్ణాటక ప్రభుత్వం రద్దు చెయ్యడంతో ఆ రాష్ట్ర మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జానర్దన్ రెడ్డి స్పందించారు. మంగళవారం కల్లడ్క చేరుకున్న గాలి జనార్దన్ రెడ్డి పేద విద్యార్థులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు.

కల్లడ్క శ్రీరామ స్కూల్, కల్లూరు దేవాలయం దత్తతను రద్దు చేస్తూ సిద్దరామయ్య ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. సీఎం సిద్దరామయ్య తీరుపై బీజేపీ నాయకులు, కల్లూరు దేవాలయం భక్తులు, రాజకీయ పార్టీలకు అతీతంగా కల్లడ్క ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శించారు.

Gali Janardhana Reddi met Kalladka Prabhakar Bhat

కల్లడ్క శ్రీరామ స్కూల్ నిర్వహకులు కల్లడ్క ప్రభాకర్ భట్ పేద విద్యార్థులను ఆదుకోవడానికి భిక్షాం దేహీ కార్యక్రమం చేపట్టి నిధులు సమకూర్చుతున్నారు. భిక్షాం దేహీ కార్యక్రమం ద్వారా నిధులు సేకరించి పేద విద్యార్థులను ఆదుకుంటున్నారు. మంగళవారం కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కల్లడ్క చేరుకున్నారు.

కల్లడ్క శ్రీరామ స్కూల్ లో ప్రభాకర్ భట్ తో గాలి జనార్దన్ రెడ్డి చర్చించారు. పేద విద్యార్థులను ఆదుకోవడానికి తన వంతు కృషిగా భిక్షాం దేహీ నిధులకు రూ. 26 లక్షల చెక్ ను గాలి జనార్దన్ రెడ్డి శ్రీరామ స్కూల్ నిర్వహకులు కల్లడ్క ప్రభాకర్ భట్ కు అందించారు.

సిద్దరామయ్య ప్రభుత్వం శ్రీరామ స్కూల్, కల్లూరు దేవాలయంపై చిన్నచూపు చూడటంతో గాలి జనార్దర్ రెడ్డి స్పందించారు. 2018లో కర్ణాటక శాసన సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో గాలి జనార్దన్ రెడ్డి అప్పుడే ప్రజాసేవ చెయ్యడం మొదలు పెట్టారు. గాలి జనార్దన్ రెడ్డి రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇస్తారని అ అప్పుడే చిన్న క్లూ ఇచ్చారు.

English summary
Karnataka former minister Gali Janardhana Reddi met Kalladka Prabhakar Bhat near Mangaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X