Gandhi News: కరెన్సీ నోట్లపై గాంధీ చిత్రం వెనుక సుదీర్ఘ స్టోరీ..మొదటి ఛాయిస్ మహాత్ముడు కాదు..
Gandhi on currency notes: ఇవాళ మనం ఉపయోగించే ప్రతి వస్తువు మరియు ఉత్పత్తికి ఓ చరిత్ర ఉంటుంది. అదే విధంగా నిత్యం వినియోగించే కరెన్సీ వెనుక కూడా సుదీర్ఘ హిస్టరీ దాగి ఉంది. కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ ప్రింట్ చేయాలనే నిర్ణయం వెనుక చాలా ఉదంతాలే జరిగాయి. మహాత్ముడు పుట్టిన రోజున ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
స్వతంత్రం వచ్చిన కొత్తలో భారత కరెన్సీ నోట్లపై ముద్రించేందుకు గాంధీ ఫోటో మొదట తిరస్కరించబడింది. చాలా కాలం తర్వాత మహాత్ముడి బొమ్మ నోట్లపై ప్రింట్ చేయబడం ప్రారంభించారు. 1949లో కరెన్సీ ప్రింటింగ్ కోసం భారత ప్రభుత్వం కొత్త డిజైన్ తీసుకువచ్చింది. గాంధీ ఫొటోకు బదులు మొదటగా సారనాథ్‌లోని సింహాల చిత్రాన్ని పరిగణలోనికి తీసుకున్నారు.

స్వాతంత్ర్యం తర్వాత చాలా ఏళ్ల పాటు దేశీయ గొప్ప వారసత్వం మరియు పురోగతికి సంబంధించిన పలు చిత్రాలు బ్యాంక్ నోట్లపై ముద్రించారు. 1950-60 మధ్య పులులు, జింకలు వంటి గంభీరమైన జంతువులతో పాటు హీరాకుడ్ ఆనకట్ట, ఆర్యభట్ట ఉపగ్రహం వంటి పారిశ్రామిక ప్రగతికి చిహ్నాలను వినియోగించారు. బృహదీశ్వర దేవాలయం డిజైన్ కూడా సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా కొంతకాలంపాటు ఉపయోగించారు.
1969లో గాంధీ జయంతి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మొదటిసారి మహాత్ముడి చిత్రం కరెన్సీ నోటుపై కనిపించింది. సేవాగ్రామ్ ఆశ్రమం నేపథ్యంలో గాంధీ కూర్చున్నట్లు ఆ డిజైన్‌లో చూపబడింది. ఆ తర్వాత 1987లో జనతా పార్టీ రద్దు చేసిన అధిక విలువ కలిగిన నోట్ల స్థానంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 500 నోట్లు తిరిగి ప్రవేశపెట్టింది. అప్పుడు కొత్త 500 నోటుపై గాంధీ చిత్రాన్ని ప్రింట్ చేశారు. ఇక 1996లో RBI మహాత్మా గాంధీ సిరీస్‌ను ప్రారంభించింది. ఇందులో వాటర్‌మార్క్‌లు మరియు సెక్యూరిటీ థ్రెడ్‌ల వంటి పలు ఇతర భద్రతా ఫీచర్లను జోడించింది.
ఈ ఘటన భారతదేశ కరెన్సీ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే అప్పటి నుంచి భారతీయ నోట్ల అన్ని డినామినేషన్లలో గాంధీ చిత్రం శాశ్వత ముఖంగా మారింది. తదనంతర కాలంలో కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మను మార్చాలని వివిధ వర్గాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ వంటి నాయకులతో పాటు లక్ష్మీ మరియు గణేష్ తరహా దేవతలను కూడా ప్రింట్ చేయాలని డిమాండ్లు వినిపించాయి.
ఇక రెండేళ్ల క్రితం రిలీజ్ చేసిన డిజిటల్ రూపాయి డిజైన్‌పై బాపు చిత్రాన్ని చేర్చనందుకు మహాత్ముడి మునిమనవడు తుషార్ గాంధీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. డిజిటల్ కరెన్సీ రూపకల్పనలో మహాత్మా గాంధీని విస్మరించినందుకు RBI సహా కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతూ ట్వీట్ చేశారు. అమెరికన్ పౌర హక్కుల నేతగా చెప్పబడే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కూడా భారతీయుల జీవితాల్లో గాంధీ ఉనికితో పాటు శాంతి, అహింస, సామాజిక న్యాయం వంటి ఆయన సిద్ధాంతాలు విస్మరించజాలనివి అని కామెంటే చేశారు.












Click it and Unblock the Notifications