Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వినాయకుడి విగ్రహ పత్రిష్టాపన ఎలా చేయాలి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి..?

దేశంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగ వినాయక చవితి. మొత్తం 11 రోజులపాటు జరిగే ఈ వేడుక పలు రాష్ట్రాల్లో చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇక వినాయకుడి గురించి మన పెద్దలు ఎన్నో కథలు చెప్పి ఉంటారు. ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు ఏకదంతుడిని స్మరించుకుంటారు. ఆ తర్వాతే ప్రారంభిస్తారు. ఆగష్టు 31వ తేదీన వినాయక చవితి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథి రోజున దేశవ్యాప్తంగా వినాయక పండుగ ఘనంగా జరుపుకుంటారు.

ఈ రోజున దేవాలయాల నుంచి ప్రతి ఇంట్లో బొజ్జ గణపయ్య విగ్రహాలను ప్రతిష్టిస్తారు. మొత్తం 10 రోజుల పాటు భక్తుల నుంచి పూజలందుకుంటాడు గణపయ్య. గణపతి విగ్రహ ప్రతిష్టాపన ప్రత్యేక పద్ధతుల్లో జరుగుతుంది. ఏ పద్దతిలో జరుగుతుంది.. ఎలాంటి ముహూర్తంలో గణపయ్యను ప్రతిష్టిస్తారో ఓసారి తెలుసుకుందాం.

Ganesh Chaturthi 2022:What are the procedures to be followed while placing the Lord Ganesh Idol,Know here

అనుకూల సమయం

2022 ఆగస్టు 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:34 గంటలకు చతుర్థి ప్రారంభం అవుతుందని పండితులు చెబుతున్నారు.

గణేష్ చతుర్థి ముగింపు తేదీ: 31 ఆగస్టు బుధవారం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాలకు చతుర్థి ముగుస్తుంది

గణపతి ప్రతిష్టాపన ముహూర్తం: ఆగస్టు 31 బుధవారం, ఉదయం 11 గంటల 5 నిమిషాలకు మరియు సెప్టెంబర్ 1 మధ్యాహ్నం 01:38 నిమిషాల వరకు అనుకూలంగా ఉంది.

Ganesh Chaturthi 2022:What are the procedures to be followed while placing the Lord Ganesh Idol,Know here

గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపన పద్ధతి

గణేష్ చతుర్థినాడు గణపతి ప్రతిష్ఠాపన నియమాలను పాటించాలి. అవి ఈ విధంగా ఉన్నాయి.

* ముందుగా విగ్రహం ఏర్పాటు చేసే స్థలాన్ని నీళ్లతో శుద్ధి చేయాలి

* ఆ తర్వాత ఎర్రటి తివాచీ పరచి అక్షత్ ఉంచాలి

* దీనిపై విగ్రహాన్ని ప్రతిష్టించాలి

* ఆ తర్వాత వినాయకుడిపై గంగా జలం చల్లాలి

* విగ్రహాన్ని ప్రతిష్టించేముందు , ఆ విగ్రహానికి ఇరువైపులా ఒక తమలపాకును ఉంచాలనే విషయాన్ని మరువకూడదు.

* గణపతి విగ్రహానికి కుడి వైపున నీటితో నిండిన కలశాన్ని ఉంచాలి

* చేతిలో అక్షతలు మరియు పుష్పాలతో భగవంతుని ధ్యానించాలి

* ఓం గన్ గణపతయే నమః అనే మంత్రాన్ని జపించాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+