కోల్‌కతా లా కాలేజీలో గ్యాంగ్ రేప్.. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినందుకే!
Kolkata: కోల్‌కతాలోని లా కళాశాలలో న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది.ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 24 ఏళ్ల బాధిత యువతి తనపై ఒక మాజీ విద్యార్థి, ఇద్దరు ప్రస్తుత విద్యార్థులు లా కళాశాల క్యాంపస్‌లోని గార్డు గదిలో సామూహిక అత్యాచారం చేశారని తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రధాన నిందితుడి పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన తర్వాత ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని వివరించింది. తాను 'జే' అని ఫిర్యాదులో పేర్కొన్న మాజీ విద్యార్థికి ఇద్దరు విద్యార్థులు సహకరించారని.. వారు కూడా తనపై అత్యాచారం చేశారని ఆమె తెలిపింది.
బాధితురాలి ఫిర్యాదులోని భయంకర వివరాలు ఇవే..
ప్రధాన నిందితుడు తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని.. అయితే తాను ఇప్పటికే ఒక రిలేషన్‌లో ఉన్నందున నిరాకరించానని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. ప్రధాన నిందితుడు తన ప్రియుడికి హాని చేస్తానని, తన తల్లిదండ్రులను తప్పుడు కేసులలో ఇరికిస్తానని బెదిరించాడని, ఆ తర్వాత తనను కళాశాల లోపల బంధించి దాడి చేశాడని.. తన ప్రతిఘటన ఉన్నప్పటికీ తాను గాయపడ్డానని ఆమె ఆరోపించింది. వారు తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలనే ఉద్దేశంతో బలవంతం చేయడానికి ప్రయత్నించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. "నేను నిరాకరించి, అతనిని ఏమీ చేయనివ్వకుండా వెనక్కి నెట్టి పోరాడాను. నేను ఏడ్చాను. నన్ను వదిలిపెట్టమని కోరాను. నాకు ఒక ప్రియుడు ఉన్నాడని, నేను నా ప్రియుడిని ప్రేమిస్తున్నానని వారికి చెప్పాను. కానీ వారు అంగీకరించలేదు." బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది.

తనకు శ్వాస ఆడకపోవడంతో బాధపడ్డానని.. అయితే ఎటువంటి సహాయం లభించలేదని బాధితురాలు తెలిపింది. తనను ఆస్పత్రికి తీసుకెళ్లమని వారని ప్రాదేయపడినా వారు సాయం చేయలేదని పేర్కొంది. వారు కళాశాల ప్రధాన గేట్ మూసివేశారని.. గార్డు నిస్సహాయంగా ఉండి సహాయం చేయలేదని తెలిపింది. ప్రధాన నిందితుడి కాళ్లపై పడి బతిమిలాడినా.. తన వెళ్లనివ్వడానికి నిరాకరించాడని ఆమె చెప్పింది. వారు మళ్లీ నన్ను ఆ గదిలోకి బలవంతంగా గార్డు గదిలోకి తీసుకువెళ్లి బట్టలు విప్పి బలవంతంగా అత్యాచారం చేయడం ప్రారంభించారని బాధితురాలు వెల్లడించింది.
ఆ దాడిని చిత్రీకరించారని,మౌనంగా ఉండాలని తనను బ్లాక్‌మెయిల్ చేశారని ఆ యువతి తెలిపింది. నిందితుడు తనపై అత్యాచారం చేస్తుండగా వీడియోలను రికార్డు చేశారని.. తాను సహకరించకపోతే ఆ వీడియోలను అందరికీ చూపిస్తామని వారు బెదిరించారని బాధిత యువతి ఫిర్యాదులో తెలిపింది. తాను వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు వారు హాకీ స్టిక్‌తో తనను కొట్టడానికి ప్రయత్నించారని ఆమె పేర్కొంది. "నాకు న్యాయం కావాలి" అని ఆమె ఫిర్యాదులో ఉంది. చివరకు ఆ రోజు సాయంత్రం తనను ప్రాంగణం నుంచి వెళ్ళడానికి అనుమతించారని, అయితే మరింత హాని చేస్తామని బెదిరించిన తర్వాతే అలా చేశారని బాధితురాలు తెలిపింది.
అరెస్టులు.. కొనసాగుతున్న దర్యాప్తు
24 ఏళ్ల బాధితురాలు బుధవారం పరీక్షకు సంబంధించిన ఫారాలు నింపేందుకు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కళాశాలకు చేరుకుంది. ఆమె మొదట కళాశాల యూనియన్ గదిలో కూర్చుంది. ఫిర్యాదు ప్రకారం, నిందితుడు తరువాత ప్రధాన కళాశాల గేట్‌ను మూసివేయమని ఆదేశించాడు. ఆ తర్వాత క్యాంపస్‌లోని సెక్యూరిటీ గార్డు గదిలో తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదుదారురాలు తెలిపింది. కస్బా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా(31) ఒక మాజీ విద్యార్థి, ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషద్(TMCP) దక్షిణ కోల్‌కతా జిల్లా యూనిట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఇతర ఇద్దరు నిందితులు మొదటి సంవత్సరం విద్యార్థులు జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీ అలియాస్ ప్రమిత్ ముఖోపాధ్యాయగా గుర్తించారు.
ఈ ఘటన జూన్ 25న రాత్రి 7:30 నుండి 10:50 గంటల మధ్య కళాశాల ప్రాంగణంలో జరిగినట్లు ఆరోపణలున్నాయి. పోలీసులు బాధితురాలికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించారు. ఫోరెన్సిక్ పరీక్ష కోసం ఘటన జరిగిన ప్రదేశాన్ని సురక్షితంగా ఉంచారు.మోనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్‌లను జూన్ 26న సిద్ధార్థ శంకర్ రాయ్ శిశు ఉద్యాన్, తాల్‌బాగన్ క్రాసింగ్ సమీపంలో అరెస్టు చేయగా, ప్రమిత్ ముఖర్జీని జూన్ 27న తెల్లవారుజామున అతని నివాసం నుండి అరెస్టు చేశారు. ముగ్గురి మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.నిందితులను గురువారం అలీపూర్ కోర్టులో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పోలీసులు పద్నాలుగు రోజుల కస్టడీ కోరగా, కోర్టు తదుపరి దర్యాప్తుకు వీలుగా ముగ్గురికీ ఐదు రోజుల పోలీసు కస్టడీని మంజూరు చేసింది.
స్పందించిన జాతీయ మహిళా కమిషన్
జాతీయ మహిళా కమిషన్ (NCW) ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించింది. ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్ కోల్‌కతా పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. బీఎన్‌ఎస్ (భారతీయ న్యాయ సంహిత) సంబంధిత నిబంధనల ప్రకారం కాలపరిమితితో కూడిన దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు.బాధితురాలికి పూర్తి వైద్య, మానసిక, చట్టపరమైన మద్దతును అందించాలని, అలాగే బీఎన్‌ఎస్‌ఎస్ (భారతీయ నాగరిక సురక్ష సంహిత) సెక్షన్ 396 కింద పరిహారం అందించాలని పేర్కొన్నారు. ఈ సెక్షన్ నేరం ఫలితంగా నష్టం లేదా గాయం పొందిన బాధితులకు పరిహారం అందిస్తుంది. ఈ ఘటనపై మూడు రోజుల్లోగా వివరణాత్మక కార్యాచరణ నివేదికను కమిషన్ కోరింది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications