• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహిళా కానిస్టేబుల్ నూ వదలని కామాంధులు; బర్త్ డే పార్టీకి పిలిచి, గ్యాంగ్ రేప్ చేసి ఆపై వీడియో తీసి...

|

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచార ఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి . ఏకంగా మధ్య ప్రదేశ్ పోలీస్ శాఖలో పనిచేసే ఒక మహిళా కానిస్టేబుల్ పైనే సామూహిక అత్యాచారం జరిగింది అంటే అక్కడి పరిస్థితి ఇట్టే అర్థమవుతుంది. మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో మహిళా కానిస్టేబుల్ పై ముగ్గురు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన అందర్నీ షాక్ కు గురి చేసింది.

ఫేస్ బుక్ లో పరిచయం .. ట్రాప్ చేసి పుట్టిన రోజని పిలిచి గ్యాంగ్ రేప్
ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఒక మహిళా పోలీసు కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అంతేకాదు అత్యాచారానికి పాల్పడుతూ దానిని వీడియో తీశారు అంటూ, ఎవరికైనా చెబితే తనను చంపేస్తానని బెదిరించారని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసుల కథనం ప్రకారం, నిందితుడు ఫేస్‌బుక్‌లో బాధితురాలైన మహిళా కానిస్టేబుల్ తో స్నేహం చేశాడు. ఏప్రిల్ నుండి వాట్సాప్‌లో ఆమెతో మాట కలిపాడు. అతను తన తమ్ముడి పుట్టినరోజు వేడుకకు మహిళా కానిస్టేబుల్ ను ఆహ్వానించాడు. నమ్మి వెళ్ళిన మహిళా కానిస్టేబుల్ అక్కడ సామూహిక అత్యాచారానికి గురైంది.

 Gang rape on a Women constable; act shot on video, brutal incident in Madhya pradesh

ఆలస్యంగా ఫిర్యాదు చేసిన మహిళా కానిస్టేబుల్
ఈ నెల ప్రారంభంలో ఈ సంఘటన జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 13వ తేదీన 30 ఏళ్ల వయసున్న ఓ మహిళా కానిస్టేబుల్ తనపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత విచారణ జరిపి ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడి తల్లిని కూడా నిందితులలో చేర్చారు. మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదులో ప్రధాన నిందితుడు, అతని సోదరుడు మరియు మరొక వ్యక్తి పుట్టినరోజు వేడుకకు తనను ఆహ్వానించారని, తనపై అత్యాచారం చేశారని మహిళా కానిస్టేబుల్ పేర్కొన్నారు.

వీడియో తీసి బెదిరింపులు .. బాధితురాలు ఇండోర్ జిల్లాలో కానిస్టేబుల్
అత్యాచారం చేస్తూ వీడియో తీసి ప్రధాన నిందితుడి తల్లి ఆమెను ఈ విషయం బయట ఎవరికీ చెప్పొద్దని బ్లాక్‌మెయిల్ చేసింది. నిందితుల తాలూకు ఒక బంధువు కూడా ఆమెను చంపేస్తానని బెదిరించాడని , ఆమె నుండి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించాడని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఇంతకు ముందు నీముచ్‌లో పనిచేసిన బాధితురాలైన మహిళా కానిస్టేబుల్ కానిస్టేబుల్ ప్రస్తుతం ఇండోర్ జిల్లాలో పని చేస్తున్నారని, తదుపరి విచారణ జరుగుతోందని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అనురాధ గీర్‌వాల్ అన్నారు.

పోలీస్ శాఖలో పని చేసే కానిస్టేబుల్ కే రక్షణ కరువు .. మధ్యప్రదేశ్ లో దారుణం
నేరానికి సంబంధించి ప్రధాన నిందితుడు మరియు అతని తల్లిని అరెస్టు చేసినట్లు గిర్వాల్ తెలిపారు. సోషల్ మీడియాలో ట్రాప్ చేసే వారికి దూరంగా ఉండాలని చెప్పి, ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలను కాపాడవలసిన ఓ పోలీసు శాఖ ఉద్యోగిని సోషల్ మీడియాలో ఆగంతకుడి ట్రాప్ లో పడి దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైంది. మహిళా కానిస్టేబుల్ పై సామూహిక లైంగిక దాడిని వీడియో తీసిన వారు ఆమె ఎవరికీ చెప్పకుండా ఉండాలని బెదిరింపులకు గురి చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహిళల రక్షణను ప్రశ్నిస్తోంది.

దారుణ నేరాలకు కేరాఫ్ అడ్రస్ మధ్య ప్రదేశ్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో క్రైమ్ రేటు విపరీతంగా పెరుగుతుంది. అఘాయిత్యాలకు, దారుణ నేరాలకు మధ్య ప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది. నిత్యం మధ్యప్రదేశ్లో ఎక్కడో ఒక చోట ఏదోదారుణ సంఘటన చోటు చేసుకుంటూనే ఉంది . ముఖ్యంగా బాలికల పై , మహిళల పై అత్యాచారాలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగినంతగా ఏ ఇతర రాష్ట్రాల్లోనూ జరగడం లేదు. తాజా పరిణామాలు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా, నిందితులకు శిక్షలు పడుతున్నా ఇలాంటి దారుణ ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది.

English summary
Three men gang-raped a woman constable in Neemuch district of Madhya Pradesh. allegedly raped and videotaped it. they threatened her. The constable gave complaint in police station, two were arrested by the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X