10 రోజులు కాలేజ్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, లాడ్జ్ లో నిర్బంధించారు, స్నేహితుడే కాలయముడు!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: సాటి కాలేజ్ విద్యార్థిని నమ్మించి తీసుకెళ్లి మరికొందరితో కలిసి బెంగళూరులో 10 రోజుల పాటు గ్యాంగ్ రేప్ చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాదిత యువతికి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. కామాంధులైన నిందితులను అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు విచారణ చేస్తున్నారు.

బెంగళూరులోని ప్రసిద్ధి చెందిన కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తున్న 20 ఏళ్ల యువతిని అదే కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తున్న యువకుడు నమ్మించి తీసుకెళ్లాడు. తరువాత బెంగళూరు నగరంలోని వైట్ ఫీల్ సమీపంలోని కాడుగోడి ( పుట్టపర్తి సత్యసాయి బాబా ఆశ్రమం) సమీపంలోని లాడ్జ్ కి పిలుచుకుని వెళ్లాడు.

Gang rape on college student in Bengaluru

లాడ్జ్ యజమాని సహాయంతో యువతిని అదే లాడ్జ్ లోని ఓ గదిలో నిర్బంధించారు. అనంతరం లాడ్జ్ యజమానితో సహ ఉడిపికి చెందిన రాఘవేంద్ర, దావణగెరెకు చెందిన సాగర్, మైసూరుకు చెందిన మంజురాజ్, పశ్చిమ బెంగాల్ కు చెందిన మనోరాజన్ పండిత్ యువతి మీద సామూహిక అత్యాచారం చేశారు.

10 రోజుల పాటు యువతిని నిర్బంధించిన కామాంధులు ఆమె మీద ప్రతి రోజూ అత్యాచారం చేశారు. యువతి కనపడటం లేదని కేఆర్ పురం పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. మంగళవారం రాత్రి లాడ్జ్ నుంచి తప్పించుకున్న యువతి పోలీసులకు విషయం చెప్పడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కామాంధులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంకా ఎంత మంది యువతులను వీరు ఇలా సామూహిక అత్యాచారం చేశారు అని ఆరా తీస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Gang rape on college student in Bengaluru in Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి