9 ఏళ్ళ క్రితం గ్యాంగ్ రేప్: నాలుగోసారి బాధితురాలిపై యాసిడ్ దాడి
అత్యాచారానికి గురైంది. అంతేకాదు యాసిడ్ దాడికి గురైంది. అయినా మానసిక ధైర్యంతో ముందుకు సాగుతున్న ఓ యువతిపై మరోసారి యాసిడ్ దాడి చోటుచేసుకొంది.
లక్నో: అత్యాచారానికి గురైంది. అంతేకాదు యాసిడ్ దాడికి గురైంది. అయినా మానసిక ధైర్యంతో ముందుకు సాగుతున్న ఓ యువతిపై మరోసారి యాసిడ్ దాడి చోటుచేసుకొంది. అయితే తాజాగా బాధితురాలిపై మరోసారి యాసిడ్ దాడికి పాల్పడ్డారు దుండగులు ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకొంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో తన హస్టల్ నుండి మంచినీటి కోసం బయటకు వచ్చింది. ఆమెపై రాత్రి 9 గంటల నుండి గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ పోసి పారిపోయారు.

ఆమెపై గతంలో మూడుసార్లు ఇదే తరహలో యాసిడ్ దాడులు చోటుచేసుకొన్నాయి. హస్టల్ వద్ద సెక్యూరిటీ ఉన్న కాని మరోసారి ఇదే తరహలో యాసిడ్ దాడి జరగడం భద్రత లోపంగా భావిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా పరిగణిస్తున్నారు.
ప్రస్తుతం కింగ్ జార్జ్ మెడికల్ వర్శిటీలో యాసిడ్ దాడికి గురైన బాధితురాలు చికిత్స పొందుతోంది. ముఖంపై కుడివైపుకు యాసిడ్ పడింది. నిందితులను గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు.
2008, 2011 , 2013 లలో ఆమెపై యాసిడ్ దాడి చోటుచేసుకొంది. 2008 లో ఆమె తన స్వగ్రామంలో ఉన్నప్పుడు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. అంతేకాదు ఆమెపై యాసిడ్ పోశారు. ఆ తర్వాత 2011 లో , 2013 లో కూడ యాసిడ్ దాడి జరిగింది. బాధితురాలు లక్నోలో యాసిడ్ బాధితులు నిర్వహిస్తున్న ఓ హోటల్ లో పనిచేస్తోంది.












Click it and Unblock the Notifications