విమానంలో ప్రయాణీకుల నుండి దోపీడీ, ఎలాగంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

ప్రేగ్: విమానాల్లో ప్రయాణించే సమయంలో ప్రయాణీకులు జాగ్రత్తలు తీసుకోవాలని చైనా సూచించింది.బీజింగ్ నుండి ప్రేగ్ వెళ్తున్న విమానంలో చాలా మంది ప్రయాణీకుల డబ్బులు చోరీకి గురయ్యాయి. ఈ విమానంలో డబ్బులు పోగొట్టున్నవారికలో ఎక్కువగా చైనీయులే ఉన్నారు.

హైనాన్ ఎయిర్ లైన్స్ విమానంలో సీటు ముందున్న పాకెట్లు, సీటు పై భాగంలో లాకర్లలో ఉన్న తమ బ్యాగుల్లో ప్రయాణికులు డబ్బు దాచుకున్నారు. అయితే విమానం ల్యాండ్ అవ్వడానికి అరగంట ముందు ఓ ప్రయాణికురాలు తన డబ్బు పోయినట్టు గుర్తించారు. దీంతో వెంటనే మిగతా వారికి చెప్పడంతో, వారిలో మరికొందరు కూడా తమ డబ్బు కూడా చోరీకి గురైనట్టు తెలుసుకున్నారు.

వివిధ దేశాల కరెన్సీ నోట్లున్న ఓ పిల్లో కవర్ ను ప్రయాణికుడి సీటు కింద గుర్తించారు. అయితే ప్రేగ్ లో విమానం ల్యాండ్ అవ్వగానే ఈ ఘటనలో చైనాకు చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి తిరిగి చైనా అధికారులకు అప్పగించారు.

Gang robbery on flight from Beijing to Prague stuns China

ఇతనితో పాటు మరో ఇద్దరు కూడ చోరీ చేశారని విమాన సిబ్బంది అనుమానాలు వ్యక్తం చే్స్తున్నారు. బీజింగ్ నుంచి వచ్చి, బెలారస్ లోనే దిగిపోయారని తెలుస్తోంది. ఈ ఘటనపై హైనాన్ ఎయిర్ లైన్స్ స్పందించడానికి నిరాకరించింది.

ఇటీవలి కాలంలో చైనాలోని విమానాల్లో దోపిడిలు చోటు చేసుకొంటున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో చోట కూర్చొని విమానంలో అటూ ఇటూ తిరుగుతూ ఏమరపాటూగా ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి డబ్బు దొంగిలిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 27న జరిగిన మరో సంఘటనలో హాంకాంగ్ నుంచి బ్రూనై వెళుతున్న విమానంలో దాదాపు రూ. లక్ష ముప్పై వేలు చోరీ చేసిన ఘటనలో వూ సాంగ్ అనే చైనా వ్యక్తికి కోర్టు 8 నెలల జైలు శిక్ష విధించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
China’s embassy in the Czech Republic has warned its nationals to be vigilant on planes after a dozen passengers had cash stolen while they were on a flight from Beijing to Prague.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి