దళిత యువతి గోళ్లు పీకీ... పోలీసుల అత్యాచారం...! సీఐతోపాటు 6గురి పోలీసుల సస్పెషన్
కొద్ది రోజుల క్రితమే రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో ఓ దళిత యువతిపై ఇసుక మాఫియా హత్యచారం చేసిన ఘటన మరవక ముందే మరో దళిత యువతిపై ఏకంగా పోలీసులే అత్యాచారం చేసిన ఘటన జరిగింది. కాగా జరిగిన సంఘనటపై రాజస్థాన్ అసెంబ్లీ నుండి బీజేపీ ఎమ్మెల్యేలు సభను వాకౌట్ చేయడంతో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది.

రాజస్థాన్‌లో పోలీసులు అరాచకం...
జూలై 3న రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన ఓ దళిత వ్యక్తి దొంగతనం కేసులో అనుమానితుడిగా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతోపాటు ఆయన మరదలను కూడ అనధికారికంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇద్దరిని నాలుగు రోజుల పాటు స్టేషన్‌లోనే ఉంచారు. నాలుగు రోజులపాటు యువతిని స్టేషన్‌లోనే బంధించిన యువతి కాళ్లు,చేతుల గోళ్లు ఊడబీకడంతో పాటు ఆత్యాచారం చేసిన పోలీసులు అనంతరం ఇంటివద్ద వదలిపెట్టి వెళ్లారు.

స్టేషన్‌లోనే అత్యాచారం...పోలీసుల సస్పెండ్...
కాగా అరెస్ట్ చేసిన దళిత యువకుడు కూడ అనుహ్యంగా మృత్యువాత పడ్డాడు. అయితే యువకున్ని పోలీసులు కోడుతుండగా తాను చూశానని మహిళ తన విచారణలో చెప్పింది.కాగా కేసుకు సంబంధించింది స్టేషన్ సీఐతోపాటు ఆరుగురు పోలీసులపై కేసు అత్యచారం,హింస నేరాల క్రింద కేసు నమోదు చేశారు.ఇక ఇదే అంశంపై రాజస్ధాన్ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. అనంతరం వాకౌట్ చేయడంతో విషయం ఒక్కసారిగా మీడియాకు పాకింది.

కోద్దిరోజుల క్రితమే ఆల్వార్‌లో మరోయువతిపై అత్యాచారం...
ఇక సాధరణ ఎన్నికల సమయంలోనే రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లో బైకుపై వెళుతున్న దళిత జంటను కొంతమంది దుండగులు ఆపి ఇసుక క్వారీల్లోకి తీసుకెళ్లి అయిగురు వ్యక్తులు దారుణంగా అత్యాచారం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగింది. దీంతో ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోడీ ప్రస్థావించడంతోపాటు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సైతం వెళ్లి భాదితురాలిని పరామర్శించారు. ఆనంతరం ఆ యువతికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగాన్ని సైతం ఇచ్చింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!