సంజు చిత్ర బృందానికి అబూసలేం లీగల్ నోటీసులు
ముంబై: 1993 ముంబై పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడు గ్యాంగ్‌స్టర్ అబూ సలేం ..బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సంజు చిత్ర బృందానికి తన లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపారు. ముంబై పేలుళ్ల తర్వాత చెలరేగిన మతఘర్షణల్లో సంజయ్ దత్‌కు మారణాయుధాలు సప్లై చేసింది అబూ సలేం అంటూ ఈ చిత్రంలో చూపించారని... కానీ వాస్తవానికి సంజయ్ దత్‌ను తన క్లైంట్ అబూసలేం ఎప్పుడూ కలిసిన దాఖలాలు లేవని అబూ సలేం లాయర్ తెలిపారు.
తనను తప్పుగా చూపించే ప్రయత్నం చిత్రం బృందం చేసిందంటూ ఆరోపిస్తూ 15 రోజుల్లో ఆ సినిమా నుంచి ఆ సీన్లు కట్ చేయకుంటే లీగల్‌గా ప్రొసీడ్ అవుతామని లాయర్ హెచ్చరించారు. ఈ క్రమంలోనే దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ, విధు వినోద్ చోప్రా, సినిమా డిస్ట్రిబ్యూటర్లకు, సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ కంపెనీలకు నోటీసులు పంపారు. తన క్లయింట్ క్యారెక్టర్‌ను తప్పుగా చూపించడంతో అబూసలేం పరువుకు భంగం వాటిల్లిందని నోటీసులో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే 1993 ముంబై పేలుళ్ల కేసులో అబూ సలేం దోషిగా తేలడంతో ప్రస్తుతం యావజ్జీవకారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. దీనితోపాటు పలుదోపిడీ కేసుల్లో కూడా నిందితుడుగా ఉన్న అబూసలేంకు ఢిల్లీ కోర్టు ఏడేళ్ల కఠినకారాగార శిక్షను 2002లో విధించింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications