ఆరు వారాల ముందు పెళ్లి: వీరమరణం (వీడియో)
హరియాణ: పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రవాదుల దాడిలో తీవ్రగాయాలై మరణించిన జవానుకు సైనిక లాంచనాలతో తుదివీడ్కోలు పలికారు. సోమవారం హరియాణాలోని అంబాలలోని గర్నాలా గ్రామంలొ వీరజవానుకు అంత్యక్రియలు నిర్వహించారు.
గర్నాలా గ్రామానికి చెందిన గురుసేవక్ సింగ్ (25) ఆరు సంవత్సరాల క్రితం సైన్యంలో గరుడ్ కమాండర్ గా ఉద్యోగంలో చేరారు. రెండు నెలల క్రితం (నవంబర్ 18 వతేది ) జస్ ప్రీత్ అనే యువతిని వివాహం చేసుకున్నారు. సెలవులు ముగించుకుని గత ఆదివారం వెళ్లి సైన్యంలో చేరారు.
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో జరిగిన ఉగ్రదాడిని గురుసేవక్ సింగ్ ధైర్యంగా ఎదుర్కొన్నారు. అయితే ఉగ్రవాదులు జరిపిన దాడిలో తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై గురుసేవక్ సింగ్ ఆదివారం మరణించారు.
గురుసేవక్ సింగ్ మృతదేహాన్ని సోమవారం ఉదయం ఆయన సొంత గ్రామానికి తీసుకు వెళ్లారు. గురుసేవక్ కుటుంబ సభ్యులు, బంధువులు, రాష్ట్ర మంత్రులు, అధికారులు, పరిసర ప్రాంతాల గ్రామస్తులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.
భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ సైనిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గురుసేవక్ సింగ్ అన్న ఆర్మీలోనే ఉద్యోగం చేస్తున్నారు. తన కుమారుడు దేశం కోసం వీరమరణం చెందాడని, తమకు గర్వంగా ఉందని గురుసేవక్ సింగ్ తండ్రి సుచా సింగ్ అన్నారు. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ గురుసేవక్ సింగ్ కుటుంబ సభ్యులకు రూ. 20 లక్షలు నష్ట పరిహారం ప్రకటించారు.












Click it and Unblock the Notifications