బెంగళూరులో సరికొత్త సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా: ముఖ్యమంత్రి ప్రకటన
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. అధికార భారతీయ జనతా పార్టీ సమా అన్ని పక్షాలు ప్రచార కార్యక్రమాలను జోరుగా సాగిస్తోన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవలే కర్ణాటకలో పర్యటించారు. కాంగ్రెస్ కూడా బస్సు యాత్ర చేపట్టింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఇటీవలే బెంగళూరులో బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఈ పరిణామాల మధ్య కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కీలక ప్రకటన చేశారు. బెంగళూరు శివారు ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోన్నామని పేర్కొన్నారు. మెట్రో రైలు కనెక్టివిటీని కల్పించామని, దీన్ని నగర శివార్లకు విస్తరించనున్నట్లు చెప్పారు. బెంగళూరు చుట్టూ 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలన్నింటినీ కోర్ ఏరియాగా అభివృద్ధి చేయనున్నామని, అన్ని రకాల వసతులను కల్పిస్తామని చెప్పారు.

ఇవ్వాళ బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఖాదీ ఉత్సవ్ ను ప్రారంభించారు. బెంగళూరు అభివృద్ధి మాట్లాడారు. నగర శివార్లలోని గరుడాచార్‌పాళ్యను సరికొత్తగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దబోతున్నామని బసవరాజ్ బొమ్మై చెప్పారు. దీనికి సంబంధించిన పనులు ఇదివరకే మొదలు పెట్టామని అన్నారు. దేశానికి సరికొత్త సిలికాన్ వ్యాలీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు.
మహదేవపుర ప్రాంతం ఒకప్పుడు 110 గ్రామాలకు ప్రధాన కేంద్రంగా ఉండేదని, అది ఇప్పుడు నగరం మధ్యలో ఉందని గుర్తు చేశారు. నగర-పట్టణ-గ్రామీణ నైసర్గిక స్వభావాన్ని ఈ ప్రాంతం కలిగి ఉందని అన్నారు. మహదేవపుర పరిధిలోని గరుడాచార్‌పాళ్య తాజాగా ఐటీ హబ్ గా అభివృద్ధి చెందుతోందని, ఐటీ/బీపీ కంపెనీలతో సరికొత్త సిలికాన్ సిటీగా ఆవిర్భవించనుందని, మరిన్ని సౌకర్యాలను కల్పించబోతోన్నామని అన్నారు.












Click it and Unblock the Notifications