బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుడు మాట్లాడలేదే: సనాతన్ సంస్థ, గౌరీ లంకేష్ కాల్చివేతలో సోదరుడి కొత్త ట్విస్ట్

గుర్తు తెలియని వ్యక్తి చేతుల్లో హత్యకు గురైన ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు గుంజేవారని సనాతన్ సంస్థా అధికార ప్రతినిధి చేతన్ రాజన్ అన్నారు. హత్యను ఖండిస్తున్నట్లు చెప్పారు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Gauri Lankesh : ఆమెకు మావోయిస్టులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి, అప్పుడు మాట్లాడలేదే: సనాతన్ సంస్థ

బెంగళూరు: గుర్తు తెలియని వ్యక్తి చేతుల్లో హత్యకు గురైన ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు గుంజేవారని సనాతన్ సంస్థా అధికార ప్రతినిధి చేతన్ రాజన్ ఆరోపించారు. అయితే, ఆమె హత్యను ఖండిస్తున్నట్లు చెప్పారు.

చదవండి: ఈ హత్యలు ఏం చెప్తున్నాయి: 'ఒకే రకంగా గౌరీలంకేష్-కల్బుర్గీ హత్యలు'

గౌరీ లంకేష్‌ను కాల్చివేయడం అందరూ ఖండించదగ్గ విషయమని చెప్పారు. అదే సమయంలో ఆమెకు మావోయిస్టులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఆయన 'వన్ ఇండియా'తో మాట్లాడారు.

హిందుత్వభావజాలం ఉన్నవారు చనిపోయినప్పుడు మాట్లాడరేం

హిందుత్వభావజాలం ఉన్నవారు చనిపోయినప్పుడు మాట్లాడరేం

కమ్యూనిజం భావజాలం ఉన్న వ్యక్తులు హత్యకు గురవుతున్నప్పుడు స్పందిస్తున్న వారు హిందుత్వ భావజాలం ఉన్న వారు హత్యకు గురైనప్పుడు మాత్రం స్పందించడం లేదని సనాతన్ సంస్థ ప్రతినిధి చేతన్ రాజన్ నిలదీశారు.

హత్యను ఖండిస్తున్నాం

హత్యను ఖండిస్తున్నాం

గౌరీ లంకేష్ హత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని చేతన్ రాజన్ తెలిపారు. ఆమె హత్యను తాము కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి సంఘటనలు ఏమాత్రం సహించరానివని చెప్పారు.

హిందూభావజాలం ఉన్నవారు 4గురు చనిపోతే మాట్లాడలేదేం

హిందూభావజాలం ఉన్నవారు 4గురు చనిపోతే మాట్లాడలేదేం

ఇదే కర్నాటకలో నలుగురు హిందూ భావజాలం ఉన్న వ్యక్తులు హత్యకు గురయ్యారని చేతన్ రాజన్ గుర్తు చేశారు. వారు చనిపోయినప్పుడు ఇప్పుడు గొంతు చించుకుంటున్న వారు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. దబోల్కర్ చనిపోయినప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, ఇప్పుడు కర్నాటకలోను కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని గుర్తు చేసారు

మోడీని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ

మోడీని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ

ఆరెస్సెస్, హిందూ భావజాలానికి వ్యతిరేకంగా పని చేస్తే వారిని టార్గెట్ చేసుకున్నారని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోడీ స్కిల్డ్‌ హిందూత్వ రాజకీయ వేత్త అన్నారు. మోడీ మాటల్లో ద్వంద్వార్థాలు ఉంటాయన్నారు.

గడ్కరీ కౌంటర్

గడ్కరీ కౌంటర్

గౌరీ లంకేశ్ హత్య కేసులో రాహుల్ గాంధీ చేసిన‌ ఆరోపణలపై నితిన్‌ గడ్కరీ స్పందించారు. మోడీ ఏ ఒక్క పార్టీకో చెందిన నేత కాదని, ఆయన దేశ ప్రధాని అన్నారు. ప్ర‌ధానిని విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. ఆ హత్యతో తమ పార్టీకి ఎటువంటి సంబంధమూ లేదని చెప్పారు. క‌ర్ణాట‌క‌లో శాంతి భద్రతలను చూసే బాధ్యత ఆ రాష్ట్ర అధికార‌ కాంగ్రెస్‌దే అన్నారు. సిద్ధ‌రామ‌య్య ప్ర‌భుత్వమే ఈ హ‌త్య‌కు బాధ్య‌త వ‌హించాల‌న్నారు.

గౌరీ లంకేష్ కేసులో కొత్త ట్విస్ట్

గౌరీ లంకేష్ కేసులో కొత్త ట్విస్ట్

గౌరీ లంకేష్ కేసులో కొత్త ట్విస్ట్. తనకు కర్నాటక (ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది) హోంమంత్రిత్వ శాఖపై నమ్మకం లేదని, తన సోదరి హత్య కేసులో సిబిఐ దర్యాఫ్తు జరిపించాలని గౌరీ లంకేష్ సోదరుడు ఇంద్రజీత్ లంకేష్ డిమాండ్ చేశారు.

English summary
In the killing of Gauri Lankesh, a debate has once again cropped up. This time whether it is related to the killings of Narendra Dabholkar, Govind Pansare and M M Kalburgi. Several times the name of an organisation called the Sanatan Sanstha crops up during discussions on this topic. The police have found nothing so far to suggest that the Sanatan Sansta has had anything to with these incidents.OneIndia spoke with the official spokesperson of the organisation, Chetan Rajhans. He started off by condemning the killing stating that it is wrong. Such things are wrong in a democratic setup he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X