Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గంభీర్‌పై ఆమ్ ఆద్మీ ఫిర్యాదు

Recommended Video

    Lok Sabha Election 2019 : Gautam Gambhir Has 2 Voter IDs, Says AAP Rival Atishi, Files Complaint

    ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన టీమండియా మాజ ఓపెనర్ గౌతమ్ గంభీర్ వివాదంలో చిక్కుకున్నారు. గంభీర్‌కు రెండు ఓటర్ కార్డులు ఉన్నాయంటూ ఆమ్ ఆద్మీపార్టీ తీస్ హజారీ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఆప్ అభ్యర్థి ఆతిషి మార్లెనా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

    తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంభీర్‌కు ఢిల్లీలోని కరోల్ బాగ్‌తో పాటు రాజిందర్ నగర్‌లో ఓటు ఉన్నారని ఆప్ ఆరోపిస్తోంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం కేవలం ఒక్కచోట మాత్రమే ఓటరుగా నమోదయ్యే అవకాశం ఉంది. సెక్షన్ 31 ప్రకారం రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం నేరమని, దీనికి ఏడాది వరకు జైలు శిక్ష విధించవచ్చని ఆతిషి ట్వీట్‌లో పేర్కొన్నారు.

    Gautam Gambhir Has 2 Voter IDs, AAP complains to police

    గంభీర్‌ రెండు ఓటరు కార్డులు కలిగి ఉండటంపై ఢిల్లీ సీఎం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. త్వరలోనే అనర్హత వేటు పడనున్న వ్యక్తికి ఓటు వేసి తమ ఓటును నిరుపయోగం చేసుకోవద్దని కోరారు. ఈ వ్యవహారంపై స్పందించిన గౌతం గంభీర్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేస్తున్నారు. ఆప్ నిరాధార ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ఆరోపణలు చేయడం, కోర్టులకు వెళ్లడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం ఆమ్ ఆద్మీ పార్టీకి అలవాటుగా మారిపోయిందని సటైర్ వేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+