వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘నా దేశ ప్రజల ప్రాణాలు విలువలేనివి కావు’: మావో దాడిపై గంభీర్ తీవ్ర స్పందన

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిపై టీమిండియా క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ తీవ్రంగా స్పందించాడు. వారిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని అన్నారు. ఛత్తీస్‌ఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిపై టీమిండియా క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ తీవ్రంగా స్పందించాడు. వారిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని అన్నారు. ఛత్తీస్‌ఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు..సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై దాడి జరిపిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనలో 25 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో గంభీర్‌ ఘాటుగా ట్వీట్‌ చేశాడు. 'ఛత్తీస్‌గఢ్‌, కాశ్మీర్‌, ఈశాన్యం... మనకు ఇంకా ప్రమాద ఘంటికలు అవసరమా? లేదంటే మనం చెవులు వినిపించని స్థితిలో ఉన్నామా? నా దేశ ప్రజల ప్రాణాలు విలువలేనివి కావు. దీనికి ఎవరైనా ప్రతీకారం తీర్చుకోవాల్సిందే' అని గంభీర్‌ ఘాటుగా ట్వీట్‌ చేశాడు.

కాగా, కాశ్మీర్‌లో ఆందోళన కారులు జవాను చెంపపై కొట్టినప్పుడు 'నా జవాన్‌పై పడ్డ ప్రతి దెబ్బకు కనీసం 100 జిహాదీల ప్రాణాలు పోతాయి. ఆజాదీ కావాలనుకొనేవారు వెళ్లిపోండి. కాశ్మీర్‌ మాది' అని గంభీర్ ఇటీవల స్పందించిన విషయం తెలిసిందే.

English summary
Cricketer Gautam Gambhir has time and again called for action to be taken against those who attack India’s defence forces – be it the Border Security Forces (BSF) or Central Reserve Police Force (CRPF). After the attack in Chhattisgarh’s Sukma district in which 25 CRPF jawans were killed, Gambhir asked for action and response in retaliation to the loss of lives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X