వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'గే వరుడు కావలెను' ప్రకటనకు స్పందన: 73 మంది దరఖాస్తు

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: ‘గే వరుడు కావలెను' అంటూ ప్రచురితమై సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేసిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలనుంచి 73 ప్రపోజల్స్‌ వచ్చాయని గే హరీష్‌ తల్లి, పద్మ అయ్యర్‌ తెలిపారు. ప్రకటనలో తెలిపినట్లుగా ఎక్కువమంది అయ్యర్లే ప్రతిస్పందించారని ఆమె చెప్పారు.

ఈ ప్రకటనకు వచ్చిన స్పందన చూస్తుంటే ఆనందంగా ఉందని హరీష్‌ తెలిపారు. ఆస్ట్రేలియా, యూకే, అమెరికాల నుంచే కాకుండా సౌదీ అరేబియానుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. అయ్యర్లతోపాటు గుజరాతీలు, ముస్లింలు చాలా మంది మెయిల్‌ చేశారని హరీష్‌ తెలిపారు. అబుదాబి నుంచి ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటే ఆయనకున్న రాజభవనంలాంటి ఇల్లు రాసిస్తానన్నారని హరీష్‌ చెప్పారు.

Gay groom statement: good response

ఓ తల్లి నిజాయితీగా తన గే కుమారుడికి వరుడు కావాలని ప్రకటన ఇచ్చిన విషయం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తన వయస్సు 58 సంవత్సరాలని, తాను ఈ లోకం విడిచే వెళ్లే కంటే ముందే తన కుమారుడు ఓ ఇంటి వాడు కావాలని, అందుకే ప్రకటన ఇచ్చానని తెలిపింది.

ముంబైలో నివసిస్తున్న హరీష్(36) అనే గేకు వరుడు కావాలని అతని తల్లి పేపర్లో ప్రకటన ఇచ్చింది. వరుడు 25-40 సంవత్సరాల మధ్య వయసులో ఉండాలి. జంతువులను ప్రేమించాలి. శాఖాహారి అయి ఉండాలి. ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు ఉండాలి. ఎన్జీవోలో పని చేస్తూ ఉండాలని పేర్కొంది. కులంతో సంబంధం లేదు. ముంబయిలో హరీష్ అందరికీ ఎల్‌జీబీటీగా పరిచయం. ఎల్‌జీబీటీ అంటే - లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్). ఎల్‌జీబీటీ కార్యకర్తగా, ఎన్జీవోగా పని చేస్తున్నాడు హరీష్.

English summary
About 73 applications with proposals recieved to marry a gay Harish in Mumabai. It was revealed by his mother.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X