వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్ శివరాజ్‌సింగ్ చౌహన్‌కే 'గీత' పెళ్ళి బాధ్యత

సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2015 అక్టోబర్‌లో పాకిస్థాన్‌ నుండి స్వదేశం నుండి తిరిగొచ్చిన గీత అనే యువతి వివాహన్ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ ఘనంగా నిర్వహించనున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బోపాల్: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2015 అక్టోబర్‌లో పాకిస్థాన్‌ నుండి స్వదేశం నుండి తిరిగొచ్చిన గీత అనే యువతి వివాహన్ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ ఘనంగా నిర్వహించనున్నారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ స్వయంగా ఆమెకు సంబంధం చూసి కన్యాదానం చేయనన్నట్టు విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ శనివారం తెలిపారు.

విదిశ ఎంపీ అయిన సుష్మా భోపాల్ వెళ్ళిన సమయంలో తరచుగా గీతను కలిసేవారు. ఈ క్రమంలో ఆమె వివాహవిషయాన్ని ఆమెతో ప్రస్తావించేవారు. గత బుధవారం గీతను సుష్మా మరోసారి కలిసి ఆమె పెళ్ళి విషయాలు సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ చూసుకొంటారని హమీ ఇచ్చారు.

Geeta may marry soon, Shivraj will do kanyadaan, suggests Sushma Swaraj

ఎన్‌డిఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాధ్ కోవింద్ శనివారం భోపాల్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ అయ్యారు.రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమానికి సుష్మాస్వరాజ్ గీతను తీసుకెళ్ళారు.

కోవింద్, సీఎం శివరాజ్‌లు గతకు సంబంధం చూసి కన్యాదానం చేస్తారని సుష్మాస్వరాజ్ చెప్పారు. నేను భారతీయురాలిని మహత్మాగాంధీ పుట్టిన దేశంలో పుట్టాను. అందుకే భారత్‌లోనే ఉండాలని నిర్ణయించుకొన్నానని చెప్పారు.

ప్రస్తుతం గీత హిందీ, ఇంగ్లీష్ భాషలు నేర్చుకొంటుందని ఇండోర్ అకాడమీ అధ్యక్షుడు మురళీధర్‌థమణి చెప్పారు. పుట్టుకతోనే చెవిటి, మూగ అయిన గీత 2003లో దారితప్పి పాకిస్తాన్ చేరుకొంది. లాహోర్ రైల్వేస్టేషన్‌లో పాక్ రేంజర్లు ఆమెను గుర్తించారు. దాదాపు 12 ఏళ్ళు పాక్‌లోని ఈదీ పౌండేషన్ ఆమె బాధ్యతలను స్వీకరించింది. సుష్మాస్వరాజ్ జోక్యంతో ఎట్టకేలకు 2015 అక్టోబర్ 26న, గీత భారత్‌కు చేరుకొంది. అప్పటినుండి గీత తల్లిదండ్రుల కోసం అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె పెళ్ళి బాధ్యతలను శివరాజ్‌సింగ్ చౌహన్ స్వీకరించారు.

English summary
GEETA, THE hearing-and speech-impaired woman who returned to India in 2015 after accidentally reaching Pakistan as a child, will get married soon and Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan can do the kanyadaan, External Affairs Minister Sushma Swaraj suggested in Bhopal on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X