చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు పూర్తి, కుమార్తెలకు త్రివర్ణ పతాకం, 17 శతఘ్నులతో వందనం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో బ్ారర్ స్క్వేర్ శ్మశానవాటికలో పూర్తయ్యాయి. వారికి దేశం కన్నీటి వీడ్కోలు పలికింది. అధికారులు, ప్రముఖుల నివాళుల అనంతరం.. కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రావత్ దంపతుల భౌతికకాయాలపై కప్పిన త్రివర్ణ పతాకాన్ని.. కుమార్తెలకు అందజేశారు. కర్మలను కూతుళ్లే నిర్వహించారు.

సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. రావత్‌కు గౌరవ సూచకంగా 17 శతఘ్నులను గాల్లోకి పేల్చి వందనం సమర్పించారు. సీడీఎస్ అంత్యక్రియల్లో 800 మంది సర్వీస్ సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీఆర్డీవో చీఫ్ సతీశ్ రెడ్డి, పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులు తదితరులు హాజరై వీడ్కోలు పలికారు.

Gen Bipin Rawat Funeral completed: Daughters Perform Last Rites; 17-Gun Salute, 800 Service Personnel At Funeral

కాగా, శుక్రవారం ఉదయం రావత్ దంపతుల భౌతిక కాయాలను కామ్ రాజ్ మార్గ్ లోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడే పలువురు కేంద్రమంత్రులు, సైనికాధికారులు, రాజకీయ ప్రముఖులు వారికి నివాళులర్పించారు. అనంతరం కామ్ రాజ్ మార్గ్ నుంచి బ్రార్ స్క్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగింది. రెండు గంటలపాటు సాగిన ఈ అంతిమ యాత్రలో దారిపొడవునా ప్రజలు రావత్ కు వీడ్కోలు పలికారు. పూలు చల్లారు.

Recommended Video

CDS Gen Bipin Rawat Last Rites దేశ విదేశాల నుండి ప్రముఖుల నివాళులు !! || Oneindia Telugu

కాగా, రావత్ అంత్యక్రియల్లో శ్రీలంక, నేపాల్, భూటాన్ దేశాల సైనిక ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీలంక సీడీఎస్ అండ్ కమాండర్ జనరల్ షవేంద్ర సిల్వా, రావత్ కు మంచి మిత్రుడైన శ్రీలంక మాజీ అడ్మిరల్ రవీంద్ర చంద్రసిరి, రాయల్ భూటాన్ ఆర్మీ డిప్యూటీ ఆపరేషన్స్ చీఫ్ బ్రిగేడియర్ డోర్జీ రించన్, నేపాల్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ బాలకృష్ణ కార్కీ, బంగ్లాదేశ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ డివిజన్ స్టాఫ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ వకార్ ఉజ్ జమాన్, పలు దేశాల రాయబారులు రావత్ పార్థీవ దేహానికి నివాళులర్పించారు.

English summary
Gen Bipin Rawat Funeral completed: Daughters Perform Last Rites; 17-Gun Salute, 800 Service Personnel At Funeral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X