ఎన్నికల్లో పోటీకి చదువుండాలి: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: పంచాయితీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలంటే తగిన విద్యార్హతలు కావాలని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయంలో హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్ధించింది.
గ్రామాల్లో పరిశుభ్రత మెరుగుపడాలన్నా, అక్షరాస్యత పెరగాలన్నా, మరుగుదొడ్లు నిర్మించాలన్నా, బిల్లులు పరిశీలించాలన్నా విద్యార్హతలు ఉన్న రాజకీయ నాయకులు ఉండాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సుప్రీం కోర్టు ఏకీభవించింది.
హర్యానా ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టం ప్రకారం పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కచ్చితంగా విద్యార్హతలు ఉండాలి. జనరల్ కేటగిరి అభ్యర్థులు 10వ తరగతి, దళితులు 8వ తరగతి వరకు చదివి ఉండాలి.

దళిత మహిళలు కనీసం 5వ తరగతి చదివి ఉండాలని హర్యానా ప్రభుత్వం చట్టం తీసుకు వచ్చింది. అయితే ఈ చట్టం వలన గ్రామాల్లో 84 శాతం మంది దళిత మహిళలు, 71 శాతం మహిళలు ఎన్నికల్లో పోటీ చెయ్యలేకపోతున్నారని ఆల్ ఇండియా డెమొక్ట్రటిక్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి హర్యానా ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త చట్టం అడ్డంకిగా మారుతుందని ఆ సంస్థ సుప్రీం కోర్టులో వాదన వినిపించింది. అయితే హర్యానా ప్రభుత్వం తీసుకున్న చట్టం ప్రకారం గ్రామాలు అభివృద్ది చెందుతాయని గురువారం సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications