వినోదం: విమానం ఎమర్జెన్సీ తలుపు తీశాడు

ముంబై: జెట్ ఎయిర్ వేస్ విమాన సంస్థకు ప్రయాణికుల నుంచి విచిత్రమైన చిక్కులు ఎదురౌతున్నాయి. విచిత్రమైన కారణాలతో ఇద్దరు ప్రయాణికుల మీద జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అరెస్టు చేశారు.

జర్మనీకి చెందిన స్టీవ్ టిట్ ప్లెర్ ఆదివారం అబుధాబి నుంచి జెట్ ఎయిర్ వేస్ 9 డబ్ల్యూ 585 విమానంలో ముంబై బయలుదేరి వచ్చాడు. విమానం ముంబైలో ల్యాండ్ కావడంతో పార్క్ చేశారు. అదే సమయంలో ఇతను ఉన్నట్లు ఉండి విమానం ఎమర్జెన్సీ డోర్ తీశాడు.

విషయం గుర్తించిన విమాన సిబ్బంది అతనిని ప్రశ్నించారు. కేవలం వినోదం కోసం తాను విమానం ఎమర్జెన్సీ డోర్ తీశానని స్టీవ్ టిట్ ప్లెర్ సమాధానం ఇవ్వడంతో విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతనిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

German opens plane’s emergency door for fun at Mumbai Airport

విమానంలో సిగరేట్ తాగాడు............!

ఆదివారం సింగపూర్ నుంచి ముంబైకి జెట్ ఎయిర్ వేస్ 9 డబ్ల్యూ 09 విమానం బయలుదేరింది. ఇదే విమానంలో రవి ధాంకర్ అనే వ్యక్తి ముంబై బయలుదేరాడు. విమానంలోని బాత్ రూం దగ్గరకు వెళ్లిన రవి ధాంకర్ సిగరెట్ బయటకు తీశాడు.

తరువాత అక్కడే పోగ తాగుతున్నాడు. విషయం గుర్తించిన సాటి ప్రయాణికులు విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విమాన సిబ్బంది రవిని వారించారు. రవి పీకలదాక మద్యం సేవించి ఉన్నాడని సిబ్బంది చెప్పారు. విమాన సిబ్బంది ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు అతనిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+