41 ఏళ్ల తపస్సు.. పద్మశ్రీ సాధించిన విదేశీ మహిళ.

సుదూర తీరాల నుంచి కేవలం సందర్శకురాలిగా మన దేశంలో కాలుపెట్టిన ఒక విదేశీ యువతి, దశాబ్దాల కాలంలో ఇక్కడి మట్టితో, మూగజీవాలతో పెనవేసుకుపోయిన అనుబంధం అత్యంత అరుదైనది. జర్మనీ రాజధాని బెర్లిన్ నగరం నుంచి ఒక ఆధ్యాత్మిక అన్వేషణతో ప్రయాణం ప్రారంభించిన ఫ్రెడరిక్ ఇరినా బ్రూనింగ్ అనే మహిళ, కాలక్రమేణా మథురలోని రాధా కుండ్ కేంద్రంగా వేలాది అనాథ, గాయపడిన గోవులకు ప్రాణదాతగా నిలిచారు. భారతీయులు ఆప్యాయంగా 'సుదేవి మాతాజీ' అని పిలుచుకునే ఈ విదేశీ వనిత, నాలుగు దశాబ్దాలకు పైగా చేస్తున్న అసమాన సామాజిక సేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మశ్రీ'ని కూడా అందుకున్నారు.

1958లో జర్మనీలోని ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించిన బ్రూనింగ్, విద్యార్హతలు పూర్తి చేసుకున్నాక.. ప్రపంచాన్ని చూడాలనే తపనతో ప్రయాణాలు ప్రారంభించారు. టర్కీ, ఇరాన్, అఫ్గానిస్తాన్ మీదుగా 1978లో 20 ఏళ్ల వయసులో ఆమె మొదటిసారిగా భారతదేశంలో అడుగుపెట్టారు. అనంతరం ఆసియాలోని ఇతర దేశాలు తిరిగినప్పటికీ, భారతీయ యోగా, ఆధ్యాత్మిక చింతన, భగవద్గీత ఆమెను తీవ్రంగా ఆకర్షించాయి. ఒక మంచి గురువును అన్వేషించే క్రమంలో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని మథుర సమీపంలో ఉన్న రాధా కుండ్ చేరుకున్నారు. శ్రీ కిశోరి కిశోరానంద్ గోస్వామి బాబాజీ వద్ద దీక్ష తీసుకుని, దాదాపు 20 సంవత్సరాల పాటు ఆధ్యాత్మిక సాధనకే తన సమయాన్ని కేటాయించారు.

German Tourist Who Came To India In 1978 Becomes Padma Shri Winner Sudevi Mataji Caring For 2500 Cows

జీవితాన్ని మలుపు తిప్పిన ఆ చిన్న సలహా!

కేవలం ఆధ్యాత్మిక సాధనలోనే మునిగి తేలుతున్న బ్రూనింగ్ జీవితాన్ని ఒక పొరుగు వ్యక్తి ఇచ్చిన చిన్న సలహా పూర్తిగా మార్చివేసింది. ఒక ఆవును పెంచుకోవాల్సిందిగా ఆయన సూచించడంతో ఆమె ఆవును కొనుగోలు చేశారు. గోవుల సంరక్షణపై పుస్తకాలు చదవడం, స్వయంగా హిందీ భాష నేర్చుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలో పాలు ఇవ్వడం ఆపేసిన, వయసు మళ్లిన ఆవులను యజమానులు రోడ్డుపై వదిలేయడం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. ఒకరోజు కాళ్లకు గాయాలై, పురుగులు పట్టి రోడ్డుపై నరకయాతన అనుభవిస్తున్న ఒక చిన్న లేగదూడను ఇంటికి తెచ్చి శ్రద్ధగా ఉపచారాలు చేశారు. ఆ ఘటనే ఆమె జీవిత ధ్యేయాన్ని మార్చేసింది.

చేపల కోసం 70 ఏళ్ల డ్యామ్ నేలమట్టం.. ప్రకృతి సాధించిన అరుదైన విజయం!
చేపల కోసం 70 ఏళ్ల డ్యామ్ నేలమట్టం.. ప్రకృతి సాధించిన అరుదైన విజయం!

గుడిసె నుంచి బృహత్ ఆశ్రమం వైపు..

రాధా కుండ్‌లో ఒక చిన్న ప్రాంగణంలో 'సురభి గోసేవా నికేతన్' పేరుతో ప్రారంభమైన ఈ గోశాల, రోజురోజుకూ పెద్దదిగా మారింది. తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆర్థిక సాయంతో స్థలాన్ని సమకూర్చుకుని, దారిలో కనిపించే అనాథ, అనారోగ్యంతో ఉన్న ఆవులను ఆశ్రమానికి చేర్చడం మొదలుపెట్టారు. 2017 నాటికే ఈ గోశాలలో దాదాపు 1,200 ఆవులు, లేగదూడలు ఆశ్రయం పొందుతుండేవి. వీటి సంరక్షణ కోసం దాదాపు 60 మంది కార్మికులు పనిచేసేవారు. రోజురోజుకూ ఈ సంఖ్య పెరుగుతూ 2019 నాటికి 1,800 దాటి, ప్రస్తుతం 2,500 కంటే ఎక్కువ మూగజీవాలకు ఇది నిలయంగా మారింది.

సొంత ఆస్తులు అమ్మి గోసేవ!

వేలాది ఆవుల పోషణ, మందులు, గ్రాసం, సిబ్బంది జీతాల కోసం నెలకు సుమారు రూ. 35 లక్షల వరకు ఖర్చవుతుండేది. ఈ భారీ మొత్తాన్ని సమకూర్చడానికి ఆమె బెర్లిన్‌లో తనకున్న సొంత ఆస్తుల నుంచి వచ్చే అద్దె ఆదాయాన్ని .. నెలకు రూ. 6 నుంచి 7 లక్షలు పూర్తిగా గోశాలకే వెచ్చించేవారు. ప్రారంభంలో ఆమె తండ్రి కూడా ఆర్థికంగా సాయం చేసినప్పటికీ, తదనంతర కాలంలో జర్మనీలోని సొంత వనరులే ఈ ఆశ్రమానికి ప్రధాన ఆధారంగా నిలిచాయి.

వీసా సమస్యలు.. కదిలిపోయిన దేశం

నాలుగు దశాబ్దాలుగా భారతదేశంలోనే నివసిస్తున్నప్పటికీ, ఆమె జర్మన్ పౌరురాలు కావడంతో ప్రతి ఏటా వీసా రెన్యూవల్ అతిపెద్ద సవాలుగా మారేది. 2019లో ఆమె పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కొద్ది రోజులకే వీసా పొడిగింపు దరఖాస్తు తిరస్కరణకు గురైంది. "నేను వెళ్ళిపోతే ఈ వేలాది మూగజీవాలను ఎవరు చూసుకుంటారు?" అని ఆమె వ్యక్తం చేసిన ఆవేదన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అనంతరం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆమె వీసా సమస్యను పరిష్కరించింది.

Success Story: అప్పుతో మొదలైన అసాధారణ ప్రస్థానం! తెలుగోడి సైకిల్ విప్లవం
Success Story: అప్పుతో మొదలైన అసాధారణ ప్రస్థానం! తెలుగోడి సైకిల్ విప్లవం

41 ఏళ్ల తపస్సుకు 'పద్మశ్రీ' ప్రతిఫలం!

1978లో ఒక సాధారణ పర్యాటకురాలిగా భారత్‌కు వచ్చి, తన జీవితమంతటినీ గోసేవకే అంకితం చేసిన ఈ జర్మన్ వనితకు 2019 జనవరిలో భారత ప్రభుత్వం 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించి గౌరవించింది. విదేశంలో పుట్టినా, భారతీయ సంస్కృతిని, మూగజీవాల పట్ల కరుణను తన ఊపిరిగా మార్చుకున్న సుదేవి మాతాజీ ప్రయాణం సమాజానికి ఒక గొప్ప స్ఫూర్తిపాఠం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+