వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ghaziabad: ముస్లీం వృద్దుడి మీద దాడి, పాకిస్థాన్ ఏజెంట్ అని గడ్డం కత్తిరించి, జైశ్రీరామ్, వైరల్ !

|
Google Oneindia TeluguNews

లక్నో/ ఘాజియాబాద్: మసీదులో ప్రార్థనలు చెయ్యడానికి వెలుతున్న వృద్దుడి మీద అల్లరిమూకలు వారి ప్రతాపం చూపించారు. ముస్లీంలు గడ్డం పెంచుకోకూడదని, నువ్వు వెంటనే గడ్డం తీసేయాలని కత్తి తీసుకుని ఆ వృద్దుడి గడ్డం కత్తిరించారు. నువ్వు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ ఏజెంట్ అంటూ ఆ వృద్దుడి మీద దాడి చేసి చిత్రహింసలు పెట్టారు. తాను ఇక్కడే పుట్టానని, పాకిస్థాన్ కోసం పని చెయ్యడం లేదని ఆయన అల్లరిమూకలు ఎంత చెప్పినా ఆ కిరాతకులు ఏమాత్రం పట్టించుకోలేదు. వయసులో పెద్దవాడు అని కనీసం కనికరం కూడా చూపించకుండా వృద్దుడి మీద అల్లరిమూకలు దాడి చేశారు. జై శ్రీరామ్, వందేమాతరం అంటూ నినాదాలు చెయ్యాలని ఆయన మీద దాడి చేసి చిత్రహింసలు పెడుతున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రౌడీరాజ్యంలో జరిగిన ఈ సంఘటన వెలుగు చూడటంతో స్థానికంగా నివాసం ఉంటున్న ముస్లీం వృద్దులు హడలిపోయారు. ఇప్పటికే పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.

Girl: తల్లితో గొడవ, అమ్మాయికి ఉద్యోగం ఇస్తామని, ఆరు మంది గ్యాంగ్ రేప్, అత్తసోమ్ము అల్లుడు దానం !Girl: తల్లితో గొడవ, అమ్మాయికి ఉద్యోగం ఇస్తామని, ఆరు మంది గ్యాంగ్ రేప్, అత్తసోమ్ము అల్లుడు దానం !

మసీదులో ప్రార్థనలు చెయ్యాలని

మసీదులో ప్రార్థనలు చెయ్యాలని


ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ లో నివాసం ఉంటున్న అబ్దుల్ సమద్ (75) అనే వృద్దుడు మసీదులో నమాజ్ చెయ్యడానికి బయలుదేరారు. అదే సమయంలో ఆటోలో వెలుతున్న అబ్దుల్ సమద్ ను కొందురు అల్లరిమూలకు అడ్డగించారు. నువ్వు ఎవరు ?, ఎక్కడికి వెలుతున్నావు అంటూ అబ్దుల్ సమద్ ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.

గడ్డం ఎందుకు పెట్టావు.... కత్తితో కోసేసి చిత్రహింసలు

గడ్డం ఎందుకు పెట్టావు.... కత్తితో కోసేసి చిత్రహింసలు


వృద్దుడి అబ్దుల్ సమద్ మీద అల్లరిమూకలు వారి ప్రతాపం చూపించారు. ముస్లీంలు గడ్డం పెంచుకోకూడదని, నువ్వు వెంటనే గడ్డం తీసేయాలని కత్తి తీసుకుని అబ్దుల్ సమద్ గడ్డం కత్తిరించి దానికి వీడియో తీశారు. మేము గతంలో కొందరు ముస్లీంలకు ఇలాగే గడ్డం కత్తిరించాము, నువ్వు కూడా చూడు. మేము గడ్డం కత్తిరించే సమయంలో నువ్వు అడ్డు చెప్పకూడదని అబ్దుల్ సమద్ ను భయభ్రాంతులకు గురి చేశారు.

నువ్వు పాకిస్థాన్ ఏజెంట్ కదా ?

నువ్వు పాకిస్థాన్ ఏజెంట్ కదా ?

నువ్వు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ ఏజెంట్ అంటూ అబ్దుల్ సమద్ మీద దాడి చేసి చిత్రహింసలు పెట్టారు. తాను ఇక్కడే పుట్టానని, పాకిస్థాన్ కోసం పని చెయ్యడం లేదని అబ్దుల్ సమద్ ఆ అల్లరిమూకలు చెప్పినా ఆ కిరాతకులు ఏమాత్రం పట్టించుకోలేదు. వయసులో పెద్దవాడు అని కనీసం కనికరం కూడా చూపించకుండా అబ్దుల్ సమద్ మీద అల్లరిమూకలు దాడి చేసి దానిని వీడియో తీశారు.

జై శ్రీరామ్..... వందేమాతరం నినాదాలు

జై శ్రీరామ్..... వందేమాతరం నినాదాలు


వయసులో పెద్దవాడు అని కనీసం కనికరం కూడా చూపించకుండా అబ్దుల్ సమద్ మీద అల్లరిమూకలు దాడి చేశారు. జై శ్రీరామ్, వందేమాతరం అంటూ నినాదాలు చెయ్యాలని అబ్దుల్ సమద్ మీద దాడి చేసి చిత్రహింసలు పెడుతున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిందుతులు దాడి చెయ్యడంతో అబ్దుల్ సమద్ సైతం ఏమీ చెయ్యలేక జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేసి కన్నీరు పెట్టుకున్నాడు.

Recommended Video

WTC Final : We Can Beat Any Side, Anywhere - Cheteshwar Pujara || Oneindia Telugu
 ఇది ఆ రాజ్యంలోనే జరిగింది

ఇది ఆ రాజ్యంలోనే జరిగింది


సోషల్ మీడియాలో నిందితులు చేసిన అరాచకాల వీడియో వైరల్ కావడం కలకలం రేపింది. తాను ఎంత చెప్పినా మాటవినిపించుకోకుండా ఓ రూమ్ లోకి లాక్కొని వెళ్లి చిత్రహింసలకు గురి చేశారని అబ్దుల్ సమద్ స్థానిక మీడియా ముందు విలపించారు. ఈ విషయంపై ఉత్తరప్రదేశ్ లోని లోనియా సీనియర్ పోలీసు అధికారి అతుల్ కుమార్ సోన్కర్ మీడియాతో మాట్లాడుతూ వీడియోలో ఉన్న అదిల్, కాలు అనే ఇద్దిరిని అరెస్టు చేశామని అన్నారు. నిందితుల మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారని స్థానిక మీడియా తెలిపింది. 75 ఏళ్ల ముస్లీం సోదరుడి మీద అల్లరిమూకలు దాడి చెయ్యడంతో అనేక ముస్లీం సంఘాలు మండిపడుతున్నాయి.

English summary
Ghaziabad attack: Two days after a video went viral, which purportedly showed an elderly man, Abdul Samad Saifi, being assaulted and his beard being forcibly cut, Ghaziabad Police have indicated it was not a random attack and have arrested two more people for the crime Adil and Kallu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X