కశ్మీర్‌లో ఆజాద్‌కు మరోసారి చుక్కెదురు.. ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్న పోలీసులు
శ్రీనగర్ : కశ్మీర్‌లో పరిస్థితి సద్దుమణగలేదు. విపక్ష నేతలంతా ఇంకా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. ఈ క్రమంలో కశ్మీర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ... సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు ప్రయత్నించి చతికిలబడ్డారు. ఆయనను విమానాశ్రయంలోనే అధికారులు అడ్డగించారు. పార్టీ ఆఫీసుకు వెళ్లానని చెప్పినా .. వినిపించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక ఆయన ఢిల్లీకి తిరుగుపయనమయ్యారు.
కశ్మీర్‌లో గులాంనబీ ఆజాద్‌కు మరోసాకి చుక్కెదురైంది. ఇవాళ మధ్యాహ్నం కశ్మీర్ వెళ్లిన ఆయనను పోలీసులు ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఇంకా చాలా చోట్ల ఆంక్షలు కొనసాగుతున్నందున .. ఆజాద్ వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. తన ఇంటికి వెళ్లానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. పార్టీ కార్యాలయానికి వెళ్లి తిరిగి వస్తానని చెప్పినా అనుమతించలేదు.

జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దులో కశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. 40 వేల పోలీసు బలగాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ నేతలను ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. కశ్మీర్ మాజీ సీఎంలు మెహబూబ ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఈ క్రమంలో కశ్మీర్ వెళ్లేందుకు ప్రయత్నించి మరోసారి విఫలమయ్యారు ఆజాద్. ఎయిర్ పోర్టులో అడ్డుకోవడం సరికాదని మీడియాతో మాట్లాడారు ఆజాద్. ప్రజాస్వామ్యంలో ఇది సరికాదని అభిప్రాయపడక్డారు. రాజకీయ పార్టీల నేతలను కశ్మీర్‌లోకి వెళ్లనీయకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మరి ఎవరినీ రాష్ట్రంలోకి రానిస్తారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలు అసహనానికి ప్రతీక అని విమర్శించారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications