Ayodhya : అత్తారింటి నుంచి అయోధ్య శ్రీ‌రామునికి కానుక‌లు...

అత్తారింటి నుంచి అయోధ్య శ్రీ‌రామునికి కానుక‌ల వ‌ర్షం కురుస్తోంది. భార‌త‌దేశంలోని హిందువులంతా ఎంత‌గానో ఎదురుచూస్తున్న అయోధ్య రామాల‌యం ప్రారంభానికి మ‌రికొన్ని రోజులు మాత్ర‌మే ఉంది. ఇక‌, ఈ మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి దేశ విదేశాల నుంచి రాములోరికి కానుక‌లు అందుతున్నాయి. ఈ క్ర‌మంలో అయోధ్య శ్రీ‌రామునికి అత్తారింటి నుంచి కానుక‌లు అందాయి. శ్రీరాముని ధర్మపత్ని సీతమ్మ జన్మస్థలం నేపాల్‌లోని జనక్‌పూర్ అని అంద‌రికి తెలిసిందే. జ‌న‌క్‌పూర్ నుంచి 3 వేలకుపైగా కానుక‌లు అయోధ్యకు చేరుకున్నాయి.

జనక్‌పూర్‌ నుంచి వచ్చిన బహుమతుల్లో వెండి పాదుకలు, ఆభరణాలు, దుస్తులు వంటివి ఉన్నాయి. వీటితో పాటు వివిధ దేశాల‌నుంచి కూడా అయోధ్య‌కు కానుక‌లు అందాయి. అందులో శ్రీలంకకు చెందిన ప్రతినిధి బృందం ఆ దేశంలోని అశోక వాటిక నుంచి ఓ శిలను కానుక‌గా తీసుకొచ్చింది.

Ayodhya: Gifts to Ayodhya Sri Ram from mother-in-laws house

గుజరాత్‌లోని వడోదర వాసి అయిన విహా భర్వాడ్‌ 108 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పు ఉన్న అగర్‌బత్తీని తయారు చేయ‌డం జ‌రిగింది. దీని బరువు సుమారు 3610 కిలోలు ఉన్నట్లు స‌మాచారం. అంతేకాకుండా, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి 44 అడుగుల పొడవైన కంచు ధ్వజ స్తంభం, మరో 6 చిన్న ధ్వజ స్తంభాలు కూడా అయోధ్య‌కు చేరుకున్నాయి.

వివిధ ప్రాంతాల నుంచి బ‌హుమ‌తులు అందుకున్న అయోధ్య‌...

ఇవే కాకుండా లక్నోలోని అనిల్‌ కుమార్‌ సాహు అనే కూరగాయల వ్యాపారి ప్రత్యేకంగా ఓ గడియారాన్నికూడా ఏర్పాటు చేశారు. ఈ గ‌డియారంలో ఒకేసారి 8 దేశాల సమయం కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం సమయంతోపాటు జపాన్‌, రష్యా, దుబాయ్‌, చైనా, సింగపూర్‌, మెక్సికో, వాషింగ్టన్‌ డీసీ, న్యూయార్క్‌ ప్రాంతాల్లో ఉండే సమయాన్నికూడా ఈ గ‌డియారం చూపిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి తన తండ్రి కల నేర‌వేర్చుందుకు బంగారు పూత పూసిన పాదుకలతో అయోధ్య చేరుకున్నారు.

అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల కోసం మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని చెఫ్‌ విష్ణు మనోహర్ అనే వ్య‌క్తి 7000 కేజీల రామ్‌ హల్వాను త‌యారుచేయ‌బోతున్నారు. గుజరాత్‌లోని వడోదరకు చెందిన అరవింద్‌ భాయ్‌ మంగళ్‌ భాయ్‌ పటేల్‌ అనే రైతు 1100 కిలోల భారీ దీపాన్ని అయోధ్య‌కు బ‌హుమ‌తిగా ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+