సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన గిరిజా వైద్యనాథన్, మరో బాధ్యత కూడా..
తమిళనాడు కొత్త ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథన్ శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఆమె స్టేట్ విజిలెన్స్ కమిషనర్‌గా కూడా బాధ్యతలను స్వీకరించారు.
చెన్నై: తమిళనాడు కొత్త ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథన్ శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఆమె స్టేట్ విజిలెన్స్ కమిషనర్‌గా కూడా బాధ్యతలను స్వీకరించారు. గిరిజా వైద్యనాథన్ 1981 బ్యాచ్‌కు చెందిన అధికారిణి.
కాగా, ఐటీ దాడులకు గురైన సీఎస్ రామ్మోహన రావుపై తమిళనాడు ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. ఆయనను ఆ పదవి నుంచి తప్పించి, వెయిటింగ్‌లో ఉంచింది. రామ్మోహన రావు స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి గిరిజా వైద్యనాథనను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సమర్థుడైన అధికారిగా గుర్తింపు పొందిన రామ్మోహన రావును మాజీ సీఎం జయలలిత, గత జూన 8వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆమె మృతి తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా రామ్మోహన రావు, ఆయన కుటుంబీకులు, సన్నిహితులు ఇళ్లు, నివాసాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు.

దాంతో, ఆయన్ని తొలగించాలంటూ రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ గట్టిగా డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపిన సీఎం పన్నీర్ సెల్వం.. రామ్మోహన రావును తొలగించారు. ఆయన స్థానంలో గిరిజా వైద్యనాథనను నియమించారు.












Click it and Unblock the Notifications