మైసూర్ దసరా ఉత్సవాలపై తొలగిన అనిశ్చితి(పిక్చర్స్)
న్యూఢిల్లీ: మైసూర్ దసరా ఉత్సవాలకు పెట్టింది పేరు. యావత్ ప్రపంచం నలుమూలల నుండి ఈ ఉత్సవాలను వీక్షించేందుకు వస్తుంటారు. మైసూర్ మహారాజు శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడెయరు హఠాన్మరణం తర్వాత రాజవంశానికి వారసుడిని ఇంతవరకు ఎంపిక చేయని విషయం తెలిసిందే.
ఈ నేపధ్యంలో దసరా ఉత్సవాల సంప్రదాయానికి ఆటంకం కలుగుతుందేమోనని అందరూ భావించారు. సాంప్రదాయానికి భంగం వాటిల్లకుండా మైసూరులో రాజసింహాసనంపై ఖడ్గం ఉంచి గురువారం ప్రైవేట్ దర్బార్ నిర్వహించారు.
అంతకమందు ఉదయం ప్యాలెస్‌లో ఒడెయరు సోదరి తనయుడు చదురంగ కాంతరాజ అరసు సాంప్రదాయ రాజదుస్తుల్ని ధరించి ఖడ్గాన్ని సింహాసనంపై ఉంచారు. ఆ తర్వాత మహారాణి ప్రమోదాదేవి సింహాసనం, ఖడ్గానికి పూజలు నిర్వహించారు.
దీంతో విశ్యవిఖ్యాత మైసూర్ దసరా ఉత్సవాలు గురవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత గిరీష్ కర్నాడ్ చాముండేశ్వరి అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి 404వ మైసూర్ దసరా ఉత్సవాలను ప్రారంభించారు.
ఈ సందర్బంలో గిరీష్ కర్నాడ్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల్ని ప్రారంభించే అదృష్టం రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా పాల్గోన్నారు.

ప్రారంభమైన మైసూర్ దసరా ఉత్సవాలు
ప్రైవేట్ దర్బార్‌ని రాజసింహాసనంపై ఉంచిన ఖడ్గానికి పూలమాల వేస్తున్న మైసూర్ మహారాణి ప్రమోదా దేవి.

ప్రారంభమైన మైసూర్ దసరా ఉత్సవాలు
మైసూర్ దసరా ఉత్సవాల సందర్బంగా అర్జున అనే ఏనుగు చెక్క అంబారీని మోసుకొస్తున్న దృశ్యం. దీని బరువు బంగారు అంబారీతో సమానంగా ఉంటుంది.

ప్రారంభమైన మైసూర్ దసరా ఉత్సవాలు
మైసూర్ దసరా ఉత్సవాల సందర్బంగా అర్జున అనే ఏనుగు చెక్క అంబారీని మోసుకొస్తున్న దృశ్యం. దీని బరువు బంగారు అంబారీతో సమానంగా ఉంటుంది.

ప్రారంభమైన మైసూర్ దసరా ఉత్సవాలు
లాల్ బాగ్ గార్డెన్‌లో సంవత్సర ప్లవర్ షో 2014లో మైసూర్ మహారాజ ప్యాలెస్ నమూనాను ఆసక్తిగా తిలకిస్తున్న స్కూల్ విద్యార్దులు.

ప్రారంభమైన మైసూర్ దసరా ఉత్సవాలు
మెరుపులు మెరియడంతో ఆ మెరుపుల కాంతుల్లో మైసూర్ మహారాజా ప్యాలెస్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న దృశ్యం.

ప్రారంభమైన మైసూర్ దసరా ఉత్సవాలు
మెరుపులు మెరియడంతో ఆ మెరుపుల కాంతుల్లో మైసూర్ మహారాజా ప్యాలెస్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న దృశ్యం.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications