Girl: ఐ హేట్ ప్రిన్సిపాల్ అంటూ డెత్ నోట్ రాసి అమ్మాయి ఆత్మహత్య, స్కూల్ కు వెళ్లి, రైలు కింద !
బెంగళూరు: కూతురు మంచి చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తే పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సంవత్సరం 9వ తరగతి అయిపోయిన తరువాత 10వ తరగతి పాస్ అయితే మంచి కాలేజ్ లో చేర్పించాలని ఆమె కుటుంబ సభ్యులు ఆలోచించారు. స్కూల్ కు వెళ్లి వస్తున్న అమ్మాయి ఆ స్కూల్ ప్రిన్సిపాల్ తో పాటు ఆ స్కూల్ లో చదువుతున్న కొందరు విద్యార్థుల మీద స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.
స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో అమ్మాయి తల్లి మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో స్కూల్ లో అమ్మాయి కుటుంబ సభ్యులకు, స్కూల్ యాజమాన్యానికి రచ్చరచ్చ అయ్యిందని తెలిసింది. వచ్చే సంవత్సరం కూతురిని 10వ తరగతికి వేరే స్కూల్ లో చేర్పించాలని ఆమె తల్లిదండ్రులు డిసైడ్ అయ్యారు. స్కూల్ కు వెళ్లిన ఆ అమ్మాయి ఐ హేట్ ప్రిన్సిపాల్ అంటూ డెత్ నోట్ రాసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి డెత్ నోట్ లో ప్రిన్సిపాల్ తో పాటు కోందరు విద్యార్థుల పేర్లు కూడా రాసిపెట్టిందని పోలీసులు అంటున్నారు.

9వ తరగతి చదువుతున్న అమ్మాయి
బెంగళూరులోని టి దాసరహళ్ళిలోని సౌందర్య స్కూల్ లో కేఎస్ రమ్యా అనే అమ్మాయి 9వ తరగతి చదువుతోంది. కూతురు రమ్యా మంచి చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తే పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సంవత్సరం 9వ తరగతి అయిపోయిన తరువాత 10వ తరగతి పాస్ అయితే రమ్యాను మంచి కాలేజ్ లో చేర్పించాలని ఆమె కుటుంబ సభ్యులు ఆలోచించారు.

ప్రిన్సిపాల్ మీద ఫిర్యాదు చేసిన అమ్మాయి
స్కూల్ కు వెళ్లి వస్తున్న రమ్యా ఆ స్కూల్ ప్రిన్సిపాల్ తో పాటు ఆ స్కూల్ లో చదువుతున్న కొందరు విద్యార్థుల మీద స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో రమ్యా తల్లి మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో స్కూల్ లో రమ్యా కుటుంబ సభ్యులకు, స్కూల్ యాజమాన్యానికి రచ్చరచ్చ అయ్యిందని తెలిసింది.

ఐ హేట్ ప్రిన్సిపాల్ అంటూ డెత్ నోట్
వచ్చే సంవత్సరం రమ్యాను 10వ తరగతికి వేరే స్కూల్ లో చేర్పించాలని ఆమె తల్లిదండ్రులు డిసైడ్ అయ్యారు. స్కూల్ కు వెళ్లిన రమ్యా ఐ హేట్ ప్రిన్సిపాల్ అంటూ డెత్ నోట్ రాసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి డెత్ నోట్ లో ప్రిన్సిపాల్ తో పాటు కోందరు విద్యార్థుల పేర్లు కూడా రాసిపెట్టిందని, కేసు విచారణలో ఉందని, ప్రిన్సిపాల్ పరారైనాడని యశవంతపురం రైల్వే పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications