ట్యాక్సీలో రేప్‌చేశారని యువతి, డౌట్స్: బాయ్‌ఫ్రెండ్‌నని..
కోల్‌కతా: తన పైన ముగ్గురు యువకులు అత్యాచారం చేశారని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆమె వాదనపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాకు చెందిన ఓ యువతి.. తన పైన ముగ్గురు ట్యాక్సీలో అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది.
దక్షిణ కోల్‌కతాలోని హస్తింగ్స్ బ్రిడ్జి సమీపంలో తన పైన వారు అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. దీనిపై పోలీసులు ప్రాథమికంగా విచారణ జరిపారు.

అయితే ఆమె చెబుతున్న తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చెప్పేదానికి పొంతన ఉండటం లేదట. అయితే, ఇందుకు సంబంధించి పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తాను ఆమె బాయ్ ఫ్రెండ్‌ను అని అతను విచారణలో వెల్లడించాడు. కాగా, ఆమెను పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. రిపోర్ట్స్ కోసం చూస్తున్నారు.












Click it and Unblock the Notifications