ఏడేళ్లు ప్రేమించాడు, మరో యువతితో పెళ్లి, కల్యాణమండపం దగ్గర ప్రియురాలి రచ్చరచ్చ !
బెంగళూరు: ఏడు సంవత్సరాలు తనను ప్రేమించి, తనతో తిరిగిన ప్రియుడు వేరే యువతిని పెళ్లి చేసుకోవడంతో ప్రియురాలు సహనం కోల్పోయింది. ఎలాగైనా ప్రియుడికి తగిన బుద్ది చెప్పాలని కల్యాణమండపం దగ్గరకు వెళ్లి రచ్చరచ్చ చేసింది.
అయితే అప్పటికే ప్రియుడు వేరే యువతి మెడలో తాళి కట్టేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. హుబ్బళికి చెందిన సునీల్, తుమకూరుకు చెందిన మమత (యువతి పేరు మార్చాం) గత ఏడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారని సమాచారం.

అయితే సునీల్ వేరే యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. డిసెంబర్ 1వ తేదీన శుక్రవారం హుబ్బళిలోని కేఇబీ కల్యాణమండపంలో పెళ్లి. గురువారం రాత్రి పోద్దు పోయిన తరువాత మమత హుబ్బళికి బయలుదేరింది. అయితే హుబ్బళికి బస్సు ఆలస్యంగా వెళ్లింది.
బస్సు దిగిన మమత కేఇబీ కల్యాణమండపం దగ్గరకు పరుగు తీసింది. అప్పటికే సునీల్ యువతి మెడలో తాళి కట్టేశాడు. ఏడు సంవత్సరాలు తనను ప్రేమించి, వెంట తిరిగి తనను మోసం చేశాడని, మీరే న్యాయం చెయ్యాలని యువతి కల్యాణమండపం దగ్గర రచ్చరచ్చ చేసింది.సునీల్ కుటుంబ సభ్యులు ఆమెను బయటకు తీసుకెళ్లారు. సునీల్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు. హుబ్బళి ఉప నగర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications