స్కూల్ వద్దే విధ్యార్థిని తల్వార్‌తో నరికి చంపిన యువకుడు, ఎందుకంటే?

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. పాఠశాల గేటుకు సమీపంలోనే విద్యార్ధినిపై ఓ యువకుడు తల్వార్‌తో విచక్షణ రహితంగా దాడికి దిగాడు. ఈ ఘటనలో ఆ విద్యార్థిని అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన గురువారం నాడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కోట్యాలో చోటు చేసుకొంది

టీచర్లు, విద్యార్థుల ముందే ఆమెను తలనరికి కిరాతకంగా హతమార్చాడు. అనుప్పూర్‌ జిల్లాలో గురువారం మధ్యాహ్నాం ఈ ఘటన చోటు చేసుకుంది. కోట్మా పట్టణానికి చెందిన 17 ఏళ్ల పూజా పనికా, నిగ్వాని రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. ప్రస్తుతం ఆమెకు పరీక్షలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం పాఠశాలకు వెళ్లిన పూజను ఓ యువకుడు వెంబడించాడు. పాఠశాల గేట్‌ వద్దకు చేరుకోగానే అప్పటిదాకా తనతో దాచుకున్న తల్వార్‌ను తీసి ఆమెపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశాడు.

Girl brutally murdered outside nearby school premises

దీంతో పూజ వీపు, మెడ, గొంతు భాగంలో పొడిచాడు. కత్తి పోట్లకు ఆమె తల తెగిపడింది. ఆ దృశ్యాన్ని చూసిన టీచర్లు, విద్యార్థులు భయంతో పరుగులు తీశారు.మరో వైపు ఈ ఘటనను చూసిన స్థానికులు నిందితుడిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు.

2014లో యువతిని వేధించాడన్న కారణంగా దిలీప్‌ సాహూ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతనే ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని బాలిక తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు దిలీప్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక పోలీస్‌ అధికారి విజయ్‌ సింగ్‌ తెలిపారు. స్కూల్‌ ఆవరణలోనే అందరి ముందు ఈ భయానక ఘటన చోటు చేసుకోవటంతో వారం రోజులు మూసివేస్తున్నట్లు స్కూల్‌ యాజమాన్యం ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+