ఘోరం: 8వ తరగతి బాలికపై రేప్ చేసి తగులబెట్టారు

మంగళవారం మృతి చెందిన బాలిక తన సోదరితో కలిసి పొలానికి వెళ్లింది. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఆమెను లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.
తనను పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడటంతో ఆ బాలిక తాను అందరికీ చెబుతానని వారిని బెదిరించింది. దీంతో నిందితులు ఆమెను అక్కడే తగులబెట్టారు. అనంతరం వారు ముగ్గురు అక్కడి నుండి పారిపోయారు.
మృతురాలు సోదరి అక్కడి నుండి తప్పించుకొని వచ్చి విషయాన్ని తల్లిదండ్రులకు, గ్రామస్తులకు తెలియజేసింది. వారంతా సంఘటన స్థలానికి చేరుకునేసరికి బాలిక ఎనభై శాతం కాలిపోయి ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఇంకా ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications