చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమకు అడ్డు: ప్రియుడితో కలిసి తండ్రిని దారుణంగా హత్య

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కోయంబత్తారు: తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడన్ని కారణంతో ఓ అమ్మాయి కుట్రపన్ని ప్రియుడితో తండ్రిని దారుణంగా హత్య చేయించింది. అనంతరం కోర్టులో ప్రియుడితో సహా లొంగిపోయన ఘటన తమిళనాడులోని కోయంబత్తారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... కోయంబత్తూరుకు చెందిన నాగరాజ్ (60) అనే వ్యాపారవేత్తకు మహాలక్ష్మి అనే కుమార్తె ఉంది.

ఆ అమ్మాయి కోయంబత్తూరులోని రత్నం కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్స్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో సతీష్ అనే యువకుడితో ప్రేమలో పడింది. సతీష్ వయసు 19 సంవత్సరాలు. చదువు కోవాల్సిన వయసులో కాలేజీ మానేసి అల్లరి చిల్లరగా తిరుగుతుండేవాడు. అయితే కూతురి ప్రేమ విషయం తెలిసిన నాగరాజ్ చదువు కోవాల్సిన వయసులో చదువుకోవాలని, ప్రేమంచడం తప్పు అంటూ మందలించాడు.

అయితే కూతురి ప్రేమ విషయంలో మహాలక్ష్మీకి తల్లి పరిమిళ అండగా నిలిచింది. నాగరాజ్‌ తన కూతురు మహాలక్ష్మీ పేరిట రిజష్టర్ చేయించి పలు వ్యాపారాలను నిర్వహిస్తున్నాడు. దీంతో పాటు మిగతా ఆస్తులను కూడా కూతురు పేరు మీద బదలాయించాలని నాగరాజ్‌పై భార్య ఒత్తడి తెచ్చింది.

Girl conspires with lover and kills father for opposing affair

దీనికి నాగరాజ్ ససేమేరా అన్నాడు. దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న మహాలక్ష్మీ ఆయన హత్యకు కుట్ర పన్నింది. ఈ హత్యకు తల్లి సహకరించగా, ప్రియుడుతో కలిసి కన్న తండ్రిని మే 23వ తేదీన నేగమాం సమీపంలోని కప్పలంగరై ఇంట్లో స్మిమ్మింగ్ పూల్ వద్ద కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.

నాగరాజ్‌ను హత్య చేయించేందుకు మహాలక్ష్మి తల్లి నుంచి లక్షా 50 వేల రూపాయలు తీసుకుని సతీష్‌‍కు, అతని స్నేహితులకు ఇచ్చింది. అంతేకాదు మహాలక్ష్మీ తండ్రి కదలికల గురించి ప్రియడు సతీష్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందించేది. దీంతో సతీష్, తనకు తెలిసిన మరో నలుగురు స్నేహితులతో కలిసి నాగరాజ్‌ను హత్య చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

హత్య జరిగిన తర్వాత పరిమళ పరారీలో ఉండగా, మహాలక్ష్మి ప్రియుడితో కలసి శుక్రవారం కోర్టులో లొంగిపోయింది. పోలీసులు మిగిలిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. జూన్ 17 వరకు మహాలక్ష్మీ, సతీష్‌లకు కోర్టు రిమాండ్ విధించింది.

మహాలక్ష్మీని కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించగా, సతీష్‌ను పొల్లాచ్చిలోని బోర్సటాల్ స్కూల్‌కు తరలించారు. కాగా, నాగరాజ్‌కు కోయంబత్తూరులోని చొక్కంపుదూర్‌ ప్రాంతంలో మహాలక్ష్మీ పేరిట కెమికల్ ఫ్యాక్టరీ ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

English summary
An eighteen-year-old girl, who had conspired with her boyfriend to get her father killed, with the help of the latter's friends, for opposing their relationship, surrendered before court along with her lover on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X