అమ్మాయిపై గ్యాంగ్ రేప్, నిర్బంధం: తండ్రిపై నిందితుల దాడి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ 15 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగింది. నార్త్ 24 పరగణాలోని సశాన్‌లో ఈ సంఘటన గురువారంనాడు చోటు చేసుకుంది. నిందితులు తనను కొట్టారని కూడా అమ్మాయి తండ్రి ఆరోపించాడు. దాంతో అతను ఆస్పత్రి పాలయ్యాడు.
ఈ కేసులో పోలీసులు ప్రధాన నిందితుడు జహంగీర్ మొండల్‌ను శుక్రవారంనాడు అరెస్టు చేశారు. తొమ్మిదో తరగతి చదువుతున్న అమ్మాయి సశాన్‌లోని సాండలియాలో ట్యూబ్ వెల్ నుంచి నీళ్లు తీసుకురావడానికి వెళఅలింది. ఆ సమయంలో జహంగీర్ ఆ అమ్మాయిని నిర్మానుష్యంగా ఉన్న ఇంట్లోకి తీసుకుని వెళ్లాడు. తన మిత్రుడి సహకారంపై ఆమెపై అత్యాచారం చేశఆడు

ఆ తర్వాత జహంగీర్ నివాసంలో అమ్మాయిని నిర్బంధించారు. కూతురిని విడిపించుకోవడానికి వెళ్లిన తండ్రిపై జహంగీర్, అతని మిత్రుడు దాడి చేశారు. అమ్మాయి కుటుంబ సభ్యులు జహంగీర్‌పై, అతని మిత్రుడిపై సషాన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశామని, అమ్మాయిని వైద్య పరీక్షల నిమిత్తం బరసాత్ జిల్లా ఆస్పత్రికి పంపించామని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications