గ్యాంగ్‌రేప్: ప్రైవేట్ భాగాల్లో గుడ్డ ముక్క చొప్పించారు
న్యూఢిల్లీ: 14 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు అత్యంత క్రూరంగా అత్యాచారం చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
ఇంటికి సమీపంలో ఉన్న షాపులో బిస్కెట్లు, స్వీట్స్ కొనుక్కునేందుకు వెళుతున్న బాలికను ఇంటి పక్కనే నివసించే యువకుడు ఎవరో పిలుస్తున్నారంటూ పక్కకు తీసుకెళ్లాడు. ఆ యువకుడికి తోడుగా మరో ఇద్దరు యువకులు వచ్చారు.
బాలిక చేతులు బలవంతంగా తాడుతో కట్టి బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని ఊరి బయటకు తీసుకెళ్లి బాలికపై ముగ్గురు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెపితే చంపేస్తామంటూ బెదిరించి పలుమార్లు కొట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
అత్యాచారం షాక్ నుంచి తేరుకుని మూడు రోజుల తర్వాత బాధితురాలు తన మేనమామకు చెప్పడంతో అసలు విషయం బయట పడింది. దీంతో మేనమామ సాయంతో పోలీసులను ఆశ్రయించి నిందితులపై ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను మెడికల్ పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లగా భయంకరమైన నిజాలు వెలుగు చూశాయి. బాధితురాలిపై నిందిత యువకులు అతి క్రూరంగా అత్యాచారం చేయడంతోపాటు ఆమె ప్రైవేట్ భాగాల్లోకి అగ్గిపెట్టే, గుడ్డ, ఒక ఇంచ్ పొడవు ఉన్న చెక్క ముక్కని చొప్పించనట్లు వైద్యులు వెల్లడించారు.

దర్యాప్తుని ప్రారంభించిన పోలీసులు ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. బాలికలు, మహిళలపై అత్యాచారాల విషయంలో ఉత్తర ప్రదేశ్‌లోని బదౌన్ జిల్లా దేశంలోనే మొదటి స్ధానంలో ఉంది. గతంలో కూడా ఇద్దరు దళిత బాలికలపై అత్యాచారం చేసి చెట్టుకు ఉరేసిన ఘటన దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications