Minor girl: ఐటీ హబ్ లో అరాచకం, ఆరు రోజులు, నలుగురు కామాంధులు, కోచింగ్ సెంటర్ కిలాడీలు !
బెంగళూరు: టైలరింగ్ నేర్చుకుంటే ఐటీ హబ్ లోని గార్మెంట్స్ ఫ్యాక్టరీల్లో వేలల్లో జీతాలు వస్తాయని ఇద్దరు మహిళలు ప్రచారం చేశారు. ఇద్దరు మహిళలు తెలిసిన యువతులకు టైలరింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. ఇద్దరు మహిళలు వారు నివాసం ఉంటున్న ఏరియాలో అందరితో మంచితనంగా ఉంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలు, మహిళలు ఆ ఇద్దరు కిలాడీ లేడీల ఇంటికి వచ్చి వెలుతున్నారు. ఆ ఇద్దరు మహిళలు టైలరింగ్ కోసం శిక్షణ ఇస్తున్నారని అందరూ ఇంతకాలం అనుకున్నారు, అయితే 15 ఏళ్ల అమ్మాయి పోలీసులను ఆశ్రయించే వరకు అసలు మ్యాటర్ బయటకు రాలేదు. ఇద్దరు మహిళలు టైలరింగ్ కోచింగ్ ముసుగులో హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని వెలుగు చూసింది. 15 ఏళ్ల అమ్మాయి మీద ఆరు రోజుల పాటు నలుగురు కామాంధులు ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారని వెలుగు చూడటంతో ఐటీ హబ్ ప్రజలు హడలిపోయారు. ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ ఎండీ, కాంట్రాక్టర్, వ్యాపారులతో సహ ఇద్దరు మహిళలు ఈ కేసులో అరెస్టు కావడం కలకలం రేపింది.

టైలరింగ్ కోచింగ్ సెంటర్
బెంగళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్ లోని బండేపాళ్యలో కళావతి, రాజేశ్వరి అనే ఇద్దరు మహిళలు వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. టైలరింగ్ నేర్చుకుంటే ఐటీ హబ్ బెంగళూరులోని గార్మెంట్స్ ఫ్యాక్టరీల్లో వేలల్లో జీతాలు వస్తాయని కళావతి, రాజేశ్వరి చాలా మంది మహిళల దగ్గర ప్రచారం చేశారు.

ఎవ్వరికి అనుమానం రాలేదు
కళావతి, రాజేశ్వరి వారికి తెలిసిన మహిళలకు, యువతులకు టైలరింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. కళావతి, రాజేశ్వరి వారు నివాసం ఉంటున్న ఏరియాలో అందరితో మంచితనంగా ఉంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలు, మహిళలు ఆ ఇద్దరు కిలాడీ లేడీలు కళావతి, రాజేశ్వరి ఇంటికి వచ్చి వెలుతున్నారు. రాజేశ్వరి, కళావతి మహిళలకు టైలరింగ్ కోసం శిక్షణ ఇస్తున్నారని అందరూ ఇంతకాలం అనుకున్నారు,

15 ఏళ్ల అమ్మాయి
బండేపాళ్యలో నివాసం ఉంటున్న 15 ఏళ్ల అమ్మాయి రాజేశ్వరి దగ్గర టైలరింగ్ శిక్షణ తీసుకుంటున్నది. ఫిబ్రవరి 28వ తేదీ మద్యాహ్నం ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే రాజేశ్వరి వెళ్లి ఆ అమ్మాయిని పిలుచుకుని నేరుగా కళావతి ఇంటికి వెళ్లింది. తరువాత ఆ అమ్మాయి మీద ఇద్దరు కామాంధులు అత్యాచారం చేశారని తెలిసింది. ఈ విషయం బయటకు తెలిస్తే చంపేస్తామని ఆ అమ్మాయిని రాజేశ్వరి, కళావతి బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి.

తల్లికి విషయం చెప్పింది
ఆ రోజు నుంచి వరుసగా ఆ అమ్మాయిని బెదిరించి పిలిపించుకుని ఆమె మీద కామాంధులు అత్యాచారం చేస్తున్నారు. ఇంట్లో ఉన్న అమ్మాయికి కళావతి ఫోన్ చేసింది కళావతి ఫోన్ చేసిన వెంటనే ఆ అమ్మాయి హడలిపోవడం గమనించిన తల్లి ఏం జరుగుతోంది అని నిలదీసింది. ఆ సమయంలో ఆ అమ్మాయి జరిగిన విషయం మొత్తం చెప్పడంతో ఆమె తల్లి హడలిపోయింది.

కిలాడీల మ్యాటర్ లీక్
15 ఏళ్ల అమ్మాయి, ఆమె తల్లి హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసులను ఆశ్రయించే వరకు అసలు మ్యాటర్ బయటకు రాలేదు. ఇద్దరు మహిళలు టైలరింగ్ కోచింగ్ ముసుగులో హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని వెలుగు చూసింది. 15 ఏళ్ల అమ్మాయి మీద ఆరు రోజుల పాటు నలుగురు కామాంధులు ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారని వెలుగు చూడటంతో ఐటీ హబ్ ప్రజలు హడలిపోయారు.

కిలాడీ లేడీలు, కామాంధులు అరెస్టు
హోసూరులోని ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ ఎండీ కేశవమూర్తి, కాంట్రాక్టర్ సత్యరాజ్, వ్యాపారులు రఫిక్, శరత్ అనే నలుగురితో సహ ఇద్దరు మహిళలు రాజేశ్వరి, కళావతి ఈ కేసులో అరెస్టు కావడం కలకలం రేపింది. కామాంధుల నుంచి రాజేశ్వరి, కళావతి లక్షల రూపాయలు వసూలు చేసి అమ్మాయిని అప్పగించారని హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications