యువతిని చంపేసి, ఆపై అత్యాచారం చేశాడు
పూణే: ఓ కిరాతకుడు ఓ యువతిని హత్య చేసి అనంతరం ఆమెపై అత్యాచారానికి చేశాడు. మహారాష్ట్రలోని పుణె సమీపంలో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
అంధ్ ప్రాంతానికి చెందిన ఓ 17ఏళ్ల యువతి గత డిసెంబర్ 30వ తేదీన కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసుకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. శుక్రవారం యువతి మృతదేహం సమీపంలోని కొండ ప్రాంతంలో లభించింది. దీంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

ఆమెను చంపిన తర్వాత అత్యాచారం చేసినట్లు పోస్టుమార్టంలో వెల్లడైంది. గత డిసెంబర్ 30న యువతిని సంతోష్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. అక్కడ సంతోష్ ఆ యువతిపై అత్యాచారానికి యత్నించగా ఆమె అతన్ని అడ్డుకుంది.
దీంతో నిందితుడి ఆమెను రాయితో మోదీ హత్య చేశాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సంతోష్‌ను అరెస్టు చేసి, కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications