బాలికపై లైంగిక వేధంపులకు పాల్పడ్డ కళాశాల ప్రిన్సిపాల్
అగర్తాలా: దేశంలో మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా వారిపై లైంగిక వేధింపులు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఓ మైనర్ బాలిక(12)పై కళాశాల ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన ఆదివారం త్రిపురలోని కోవాయ్ జిల్లా తిలియామురా గ్రామంలో జరిగింది.
తిలియామూరా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ప్రదీప్ కుమార్ దేయ్ (56) తిలియామురా గ్రామంలో అద్దెకు ఉంటున్న యుజమాని కుమార్తెను తన గదికి రమ్మని పిలిచాడు. బాలిక తన గదికి వెళ్ళిన తర్వాత ప్రదీప్ తన ల్యాప్ టాప్‌లోని అసభ్యకర సన్నివేశాలు, ఫోటోగ్రాఫ్స్ చూపించి... బాలికపై లైంగిక వేధింపులకు దిగాడు.

దీంతో బాలిక అక్కడున్న అలారమ్‌ను మ్రోగించడంతో చుట్టుపక్కల వారు బాలికను అతడి బారి నుంచి రక్షించారని జిల్లా ఎస్పీ తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ బాలిక తండ్రి ఇంట్లో లేని సమయంలోనే ప్రిన్సిపాల్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు ఎస్పీ యూ భానుమిక్ తెలిపారు.












Click it and Unblock the Notifications