వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి రద్దు: తల్లిదండ్రులతోపాటు వధువు ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

కోటా: రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిశ్చితార్థం పూర్తయి ఇక పెళ్లే మిగిలిందని అనుకుంటుండగా.. హఠాత్తుగా వరుడు పెళ్లి రద్దు చేయడంతో వధువు, ఆమె తల్లిదండ్రులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అవమానంగా భావించిన వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

వివరాల్లో వెళితే.. కోట ప్రాంతానికి చెందిన దీక్ష(21) అనే యువతికి జైపూర్‌కి చెందిన కమల్‌తో నిశ్చితార్థమైంది. త్వరలో పెళ్లి జరగాల్సి ఉండగా డిసెంబరు 30న కమల్‌ దీక్షకి ఫోన్‌ చేసి పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు చెప్పాడు.

Girl, parents commit suicide after her fiance ends engagement

దీంతో దీక్ష తండ్రి పోలీస్‌ స్టేషన్లో కమల్‌పై కేసు కూడా పెట్టారు. అంతలోనే వధువు దీక్షతోపాటు ఆమె తల్లి కాంత(45), తండ్రి హేమంత్ ఛత్వానిలు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.

కాగా, వారి వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

English summary
Upset after her fiance broke off their engagement, a 21-year-old girl and her parents allegedly committed suicide by consuming poison at their house in Borkheda here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X