ఎంఎల్ఏ రేప్: పరిక్షలకు సిద్దం అయిన విద్యార్థిని
పాట్నా: అత్యాచారానికి గురైన బాలిక తన జీవిత లక్షం చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఎలాగైనా 10వ తరగతి పరిక్షలు రాయాలని నిర్ణయించుకుంది. స్థానిక శాసన సభ్యుడు అత్యాచారం చెయ్యడంతో (15) ఏళ్ల బాలిక షాక్ కు గురైయ్యింది. అయినా సరే చికిత్స చేయించుకుని పరిక్షలు రాయడానికి సిద్దం అయ్యింది.
తనపై జరిగిన అమానుషం నుంచి బయటపడేందుకు ఆమె దైర్యం చేసింది. ముందడుగు వేసి కొత్త జీవితాన్ని ఆరభించడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే 10వ తరగతి పరిక్షలు రాయడానికి సిద్దం అయ్యింది. గత నెల 6వ తేదీన బీహార్ కు చెందిన ఆర్జేడీ శాసన సభ్యుడు రాజ్ భల్లా యాదవ్ 10వ తరగతి చదువుతున్న బాలిక మీద అత్యాచారం చేశాడు.
ఈ విషయంలో బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శాసన సభ్యుడు రాజ్ భల్లా యాదవ్ అప్పటి నుంచి పరారైనాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవనం సాగిస్తోంది. పోలీసులు వారికి రక్షణగా ఉన్నారు.

బాలిక తండ్రి ఇచ్చిన సమాచారం మేరకు విషయం తెలుసుకున్న అధికారులు ఆమె పరిక్షలు రాయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిక్ష కేంద్రం దూరంగా ఉండటంతో అధికారులు బాలిక నివాసం ఉంటున్న ఇంటికి సమీపంలోని రహస్య ప్రాంతంలో పరిక్షలు రాసేందుకు అన్ని సౌకర్యాలు కల్పించారు.
పోలీసులు అత్యాచారం చేసిన శాసన సభ్యుడు రాజ్ భల్లా యాదవ్ ఆస్తులు సీజ్ చేశారు. అయితే అతని ఆచూకి ఇప్పటి వరకు పోలీసులకు చిక్కలేదు. అధికారంలో ఉన్న శాసన సభ్యుడు రాజ్ భల్లా యాదవ్ తనకు కావలసిన పోలీసు అధికారుల సహకారంతో తప్పించుకుని తిరుగుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications