ట్రాప్ చేస్తామని గ్యాంగ్ రేప్ చేయించిన పోలీస్

ఔరంగాబాద్: పోలీసులు అతి తెలివి ప్రదర్శించి బాలిక మీద రెండో సారి గ్యాంగ్ రేప్ జరగడానికి కారణం అయ్యారు. బాలిక మళ్లి ఫిర్యాదు చెయ్యడంతో పోలీసు అధికారులు సీరియస్ అయ్యారు. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది.

మహారాష్ట్రలోని జల్నా పట్టణంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ నెల 7వ తేదిన ఇద్దరు వ్యక్తులు 17 సంవత్సరాల బాలికను కత్తితో బెదిరించి తీసుకు వెళ్లారు. తరువాత ఆమె మీద ఇద్దరు గ్యాంగ్ రేప్ చేశారు.

అంతే కాకుండా బాలిక మొబైల్ లాక్కొని అత్యాచారం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించి ఆ ఫోన్ ఎత్తుకు వెళ్లారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం బయటకు చెబితే సోషల్ మీడియాలో ఆ క్లిప్పింగ్ లు పోస్టు చేస్తామని నిందితులు బాలికను బెదిరించారు.

Girl raped for second time as police trap to nab culprits fails in Maharashtra

పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో నిందితులు బాధితురాలి తల్లికి ఫోన్ చేశారు. రూ. 2 వేలు ఇస్తే మీ అమ్మాయి మొబైల్ మీకే ఇచ్చేస్తామని నమ్మించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాప్ చేసి నిందితులను పట్టుకోవడానికి ప్లాన్ వేశారు. బాలిక దగ్గర నిందితులకు ఫోన్ చేయించారు.

బాలిక చెప్పిన ప్రాంతానికి రావడానికి నిందితులు అంగీకరించారు. శుక్రవారం సాయంత్రం బాలికను పోలీసులు పంపించారు. అయితే ఆమె గమ్యస్థానానికి వెళుతున్న సమయంలో మధ్యలోనే బైక్ లో వెళ్లిన ఇద్దరు నిందితులు బాలికను ఎత్తుకు వెళ్లి మళ్లి రేప్ చేశారు. ఆమె మొబైల్ అక్కడే విసిరివేసి వెళ్లారు.

విషయం తెలుసుకున్న పోలీసులు హడలిపోయారు. అప్పటికే మొబైల్ లో చిత్రీకరించిన దృశ్యాలను నిందితులు డిలిట్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారి (ఐజీపీ) విశ్వాస్ నాంగ్రే పాటిల్ ఎస్ఐ వినోద్ ను సస్పెండ్ చేశారు. ప్రత్యేక పోలీసు అధికారితో కేసు దర్యాప్తు చేయిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+