చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Girl: పేమస్ డైరెక్టర్ మేనల్లుడు, యువ క్రికెటర్ రోహిత్ మీద ఫోక్స్ చట్టం కేసు, ఐదు మంది ఎస్కేప్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/పుదుచ్చేరి: క్రికెట్ ప్రాక్టీస్ చెయ్యడానికి వెలుతున్న 17 ఏళ్ల అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది, ప్రముఖ క్రికెటర్ తో పాటు అతని తండ్రి, క్రికెట్ అసోషియేషన్ వ్యవస్థాపకుడు, ఇద్దరు కోచ్ లు, క్రికెట్ అసోషియేషన్ సెక్రటరీతో సహ మొత్తం ఐదు మంది మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం కలకలం రేపింది. ప్రముఖ సినీ దర్శకుడి మేనల్లుడు, ఇటీవల ఆ దర్శకుడి కుమార్తెను వివాహం చేసుకున్న ప్రముఖ క్రికెటర్ రోహిత్ తో పాటు ఆయన తండ్రి కూడా ఈ కేసులో ఉండటం హాట్ టాపిక్ అయ్యింది. అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపిస్తూ నమోదు అయిన కేసులో ప్రముఖ క్రికెటర్ రోహిత్ తో పాటు ఐదు మంది ఇప్పుడు మాయం కావడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Lady techie:అమెరికాలో భార్య, కొత్త మొగుడి కోసం ప్రకటన ఇచ్చిన భర్త, అసలు మ్యాటర్ తెలిసి షాక్ !Lady techie:అమెరికాలో భార్య, కొత్త మొగుడి కోసం ప్రకటన ఇచ్చిన భర్త, అసలు మ్యాటర్ తెలిసి షాక్ !

 ఫేమస్ డైరెక్టర్ మేనల్లుడు.... ప్రముఖ క్రికెటర్

ఫేమస్ డైరెక్టర్ మేనల్లుడు.... ప్రముఖ క్రికెటర్

సౌత్ ఇండియాలో ఫేమస్ డైరెక్టర్ జెంటిలిమెన్ శంకర్ ఎలాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శంకర్ మేనల్లుడు రోహిత్ ప్రముఖ క్రికెటర్ అనే విషయం తెలిసింది. నాలుగు నెలల క్రితం సీఎమ్ఆర్ రోడ్డులో రంగరంగ వైభవంగా శంకర్ కుమార్ తో రోహిత్ వివాహం జరిగింది. శంకర్ కుమార్తె, రోహిత్ వివాహానికి ప్రముఖులు అందరూ హాజరైనారు.

తండ్రి క్రికెట్ అసోషియేషన్ వ్యవస్థాపకుడు

తండ్రి క్రికెట్ అసోషియేషన్ వ్యవస్థాపకుడు


రోహిత్ తండ్రి, ప్రముఖ వ్యాపారవేత్త దామాదరన్ పుదుచ్చేరి క్రికెట్ అసోషియేషన్ ఏర్పాటు చేశారు. పుదుచ్చేరిలో క్రికెట్ మైదానం కోసం ప్రభుత్వ భూమితో పాటు డ్రైనేజ్ లు ఆక్రమించి క్రికెట్ మైదానం ఏర్పాటు చేశారని వెలుగు చూసింది. అప్పటి పుదుచ్చేరి డిప్యూటీ గవర్నర్ కిరణ్ బేడి ఆదేశాల మేరకు రోహిత్ తండ్రి దామోదరన్ ఆధ్వర్యంలో ఉన్న క్రికెట్ మైదానం మూసివేశారు. విదిలేని పరిస్థితిలో పుదుచ్చేరిలోని ముతిరాయర్ పాలయం స్కూల్ మైదానంలో క్రికెట్ శిక్షణ ఇస్తున్నారు.

17 ఏళ్ల ఇంటర్ అమ్మాయి

17 ఏళ్ల ఇంటర్ అమ్మాయి


పుదుచ్చేరిలో ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల అమ్మాయి ప్రైవేట్ క్రికెట్ శిక్షాణ సంస్థలో శిక్షణ తీసుకుంటున్నది, కరోనా కారణంగా ఆ క్రికెట్ శిక్షణా శిభిరం మూసివేయడంతో అమ్మాయి పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ శిక్షణా సంస్థను సంప్రధించింది, అక్కడ క్రికెట్ కు శిక్షణ ఇస్తున్న కోచ్ తమరైకన్నన్ ఆ అమ్మాయికి క్రికెట్ శిక్షణ ఇచ్చే నెపంతో ఆమె ప్రైవేట్ బాగాల మీద ఎక్కపడితే అక్కడ చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి.

వార్నింగ్ ఇచ్చిన అమ్మాయి

వార్నింగ్ ఇచ్చిన అమ్మాయి


రెండుమూడుసార్లు ఆ అమ్మాయి అతనికి వార్నింగ్ ఇచ్చినా క్రికెట్ కోచ్ తమరైకన్నన్ మాత్రం అతని పద్దతి మార్చుకోలేదని తెలిసింది. తరువాత బాధితురాలు మరో క్రికెట్ కోచ్ జయకుమార్ కు ఫిర్యాదు చేస్తే అతను సర్దుకుపోవాలని ఆ అమ్మాయికి ఉచిత సలహా ఇచ్చాడని ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువ మాట్లాడితే నీకు క్రికెట్ లో శిక్షణ ఇవ్వమని కోచ్ లు తమరైకన్నన్, జయకుమార్ ఆమెను హెచ్చరించారని ఆరోపణలు ఉన్నాయి.

 క్రికెటర్ రోహిత్ కూడా సేమ్ డైలాగ్ ?

క్రికెటర్ రోహిత్ కూడా సేమ్ డైలాగ్ ?

కోచ్ లతో విసిగిపోయిన ఆ అమ్మాయి తరువాత క్రికెటర్ రోహిత్ ను కలిసి ఫిర్యాదు చేసింది, క్రికెటర్, డైరెక్టర్ శంకర్ అల్లుడు కూడా నువ్వు సర్దుకుపోయి క్రికెట్ లో శిక్షణ తీసుకోవాలని తనకు చెప్పాడని బాధితురాలు ఆరోపిస్తున్నది. తరువాత క్రికెటర్ రోహిత్ తండ్రి, పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు దామోదరన్ ను కలిసి కోచ్ ల మీద ఫిర్యాదు చేస్తే ఆయన కూడా సర్దుకుపోయి క్రికెట్ లో శిక్షణ తీసుకోవాలని సలహా ఇచ్చారని బాధితురాలు ఆరోపిస్తున్నది.

ఫోక్సో కేసుతో ఐదు మంది ఎస్కేప్ !

ఫోక్సో కేసుతో ఐదు మంది ఎస్కేప్ !


ఇటీవల ఇద్దరు వ్యక్తులు బాధితురాలి ఇంటికి వెళ్లి ఇంకోసారి లేనిపోని రామాయణాలు చేస్తే నీ అంతు చూస్తామని బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి, అదే సమయంలో బాధితురాలి తండ్రి పుదుచ్చేరి పోలీసులతో పాటు చైల్డ్ వెల్పేర్ అసోసియేసన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు డైరెక్టర్ శంకర్ మేనల్లుడు, క్రికెటర్ రోహిత్ తో పాటు అతని తండ్రి దామోదరన్, క్రికెట్ కోచ్ లు తమరైకన్నన్, జయకుమార్, క్రికెట్ అసోసియేషన్ సెక్రటరి వెంకట్ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారని. కేసు నమోదు అయిన వెంటనే ఐదు మంది మాయం అయ్యారని పోలీసులు అంటున్నారు.

వివాదంలో యువ క్రికెటర్, శంకర్ మేనల్లుడు రోహిత్

వివాదంలో యువ క్రికెటర్, శంకర్ మేనల్లుడు రోహిత్


మాయం అయిన ఐదు మంది కోసం గాలిస్తున్నామని పుదుచ్చేరి పోలీసు అధికారులు అంటున్నారు. ఇంటర్ చదవుతున్న 17 ఏళ్ల అమ్మాయికి క్రికెట్ లో శిక్షణ ఇచ్చే ముసుగులో లైంగిక వేధింపులకు గురి చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. క్రికెట్, సినిమా, వ్యాపార రంగాల బ్యాక్ గ్రౌండ్ ఉన్న యువ క్రికెట్ రోహిత్ ఇలాంటి కేసులో చిక్కుకోవడంతో మూడు రంగాల్లోని ప్రముఖులు షాక్ అయ్యారని తెలిసింది. ఈ విషయంలో ఇటు రోహిత్ సన్నిహితులు కాని, సినీ దర్శకుడు శంకర్ సన్నిహితులు కాని స్పందించడానికి నిరాకరిస్తున్నారని స్థానిక మీడియా తెలిపింది. మొత్తం మీద యువ క్రికెటర్, హైప్రోఫైల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న రోహిత్ మీద ఇలాంటి ఆరోపణలు రావడం కలకలం రేపింది.

English summary
Girl: Top Director Shankar's son in law Rohit booked in Pocso act in Puducherry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X