వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎనిమిదవ తరగతి బాలికకు మద్యం తాగించి గ్యాంగ్ రేప్

|
Google Oneindia TeluguNews

ముంబై: రైల్వే టిక్కెట్ తీసిస్తామని నమ్మించి బాలికను తీసుకు వెళ్లి నిర్బంధించి నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ముంబై నగరంలో జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న 14 సంవత్సరాల బాలికకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని ముంబై పోలీసు అధికారులు తెలిపారు.

ముంబై నగర డిప్యూటి కమిషనర్ మహేష్ పాటిల్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముంబై లోని సబర్బన్ అంధేరీ ప్రాంతంలో 14 సంవత్సరాల బాలిక నివాసం ఉంటూ స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఈ బాలికకు ఫేస్ బుక్ లో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు.

మే 24వ తేదిన బాలిక తనకు పరిచయం ఉన్న వ్యక్తిని కలవడానికి జమ్మూ కాశ్మీర్ వెలుతున్నానని బామ్మకు చెప్పింది. వెళ్లవద్దని బామ్మ మందలించింది. బామ్మతో గొడవ పడిన బాలిక ఇంటిలో నుండి వెళ్లి పోయింది.

అనంతరం బాలిక కుర్ణా ప్రాంతం చేరుకునింది. ఆ సమయంలో ఉమేష్ (22), దినేష్ కుమార్ (20) అనే ఇద్దరు యువకులు బాలికను పరిచయం చేసుకున్నారు. కాశ్మీర్ వెల్లడానికి తాము రైల్వే టిక్కెట్ తీసిస్తామని చెప్పారు. బాలికను చత్రపతి శివాజీ టర్మినల్ వద్దకు పిలుచుకుని వెళ్లారు.

 A girl was allegedly gangraped by four persons in Dharavi area in mumbai

రైల్వే టిక్కెట్ చిక్కలేదని, రేపు టిక్కెట్ తీసిస్తామని బాలికను నమ్మించారు. అంత వరకు తమ ఇంటిలో ఉండాలని చెప్పి పిలుచుకుని వెళ్లారు. చివరికి బాలికను ఒక లెదర్ ఫ్యాక్టరీ లోకి తీసుకు వెళ్లారు. బాలికకు బలవంతంగా మద్యం తాగించారు.

ఉమేష్, దినేష్ ఇద్దరు బాలిక మీద అత్యాచారం చేశారు. అనంతరం సల్మాన్ ఖాన్ (24), రాజ్ కుమార్ సింగ్(23) అనే ఇద్దరికి ఫోన్ చేసి పిలిపించుకున్నారు. మళ్లి బాలికకు మద్యం తాగించి నలుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. మరుసటి రోజు ఫ్యాక్టరీ బయట ఉమేష్ అనుమానస్పదంగా సంచరించాడు.

ఆ సందర్బంలో అటు వైపు వెళ్లిన జమీర్ ఖాన్ అనే వ్యక్తి ఉమేష్ ను పట్టుకుని కొట్టడంతో అసలు విషయం చెప్పాడు. ఉమేష్ తప్పించుకున్నాడు. జమీర్ ఖాన్ ఫ్యాక్టరీ బయట తాళం వేసి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు కామాంధులను అరెస్టు చేశారు. బాలికను వైద్య పరిక్షలకు తరలించి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పరారైన ఉమేష్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
The girl, a resident of suburban Andheri and studying in class VIII, had an argument with her grandmother on May 24.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X