Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Girlfriend: గర్ల్ ఫ్రెండ్ శ్రద్దా ఎముకలు గ్రైండర్ లో వేసి పొడిచేశాడు. ఇంకా చాలాచాలా చేశాడు. చార్జ్ షీట్ లో!

శ్రద్ధా వాకర్‌ను దారుణంగా హత్య చేసి 35 ముక్కలుగా నరికేసిన ఆమె ప్రియుడు అఫ్తాబ్ గర్ల్ ఫ్రెండ్ హత్య కేసులో సాక్ష్యాలను నాశనం చెయ్యడానికి ఆమె ఎముకలను గ్రైండర్‌లో వేసి ముక్కలు ముక్కలు చేసి ఆ పొడి తీసుకెళ్లి..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన శ్రద్ధా వాకర్ అలియాస్ శ్రద్దా హత్య కేసుకు సంబంధించి కొత్త సమాచారం బయటకు వచ్చింది. ప్రియురాలు శ్రద్ధా వాకర్‌ను దారుణంగా హత్య చేసి 35 ముక్కలుగా నరికేసిన ఆమె ప్రియుడు అఫ్తాబ్ గర్ల్ ఫ్రెండ్ హత్య కేసులో సాక్ష్యాలను నాశనం చెయ్యడానికి ఆమె ఎముకలను గ్రైండర్‌లో వేసి ముక్కలు ముక్కలు చేసి ఆ పొడి తీసుకెళ్లి వివిద ప్రాంతాల్లో విసిరేశాడని వెలుగు చూడటంతో పోలీసులు సైతం హడలిపోయారు. అఫ్తాబ్ క్రిమినల్ మైండ్ గురించి ఒక్కొక్క విషయం బయటకు రావడంతో పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

శ్రద్దా హత్య కేసులో 6629 పేజీల చార్జ్ షీట్

శ్రద్దా హత్య కేసులో 6629 పేజీల చార్జ్ షీట్

అఫ్తాబ్ పూనావాలా అలియాస్ అఫ్తాబ్ అతని ప్రియురాలు శ్రద్దాను హత్య చేసిన తీరు, ఇద్దరి మధ్య ప్రేమ మొదలైన వ్యవహారం, ఇద్దరి మధ్య గొడవలు, ఇతర యువతులతో అఫ్తాబ్ అక్రమ సంబంధం, అతని దూకుడు స్వభావం, శ్రద్ధాను బెదిరింపులకు గురి చేసిన తీరు, అఫ్తాబ్ ఆగడాలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు స్థానిక కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో పలు ఆసక్తికర విషయాలాు ఉన్నాయని తెలిసింది.

అఫ్తాబ్ క్రిమినల్ మైండ్, అతను శ్రద్దాను హత్య చేసిన తీరు గురించి కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు మొత్తం 6629 పేజీల చార్జ్ షీట్ ను కోర్టులో సమర్పించారు.

శ్రద్దా కొంప ముంచిన డేటింగ్ యాప్

శ్రద్దా కొంప ముంచిన డేటింగ్ యాప్

కుటుంబ సభ్యులతో కలిసి శ్రద్దా సంతోషంగా ఉండేది. 2018 లో బంబల్ డేటింగ్ యాప్ ద్వారా శ్రద్ధా, అఫ్తాబ్‌లకు పరిచయం కావడం, తరువాత పెళ్లి చేసుకోవాలని ఇద్దరు అనుకోవడం జరిగిందికున్నారు. 2019లో తొలిసారిగా శ్రద్దా, అఫ్తాబ్ శారీరక సంబంధం పెట్టుకోవడం మొదలు పెట్టారని పోలీసుల విచారణలో వెలుుగ చూసింది.

దీని తరువాత శ్రద్దా రూమ్ లో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌ను చూసిన ఆమె తల్లిదండ్రులు హడలిపోయారు. ఇదే విషయంలో శ్రద్దాను ఆమె కుటుంబ సభ్యులు ప్రశ్నించగా ఆమె అఫ్తాబ్‌తో తాను ప్రేమలో ఉన్నానని కుటుంబ సభ్యులకు చెప్పింది. అయితే దీనికి ఆమె తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడంతో అఫ్తాబ్, శ్రద్ధా వాకర్‌ను ఢిల్లీలోని ఓ అద్దె ఇంటికి తీసుకెళ్లి ఆమెతో జీవితం గడపడం మొదలుపెట్టాడు.

ఇంకో గర్ల్ ఫ్రెండ్ తో రొమాన్స్

ఇంకో గర్ల్ ఫ్రెండ్ తో రొమాన్స్

కొంతకాలం తరువాత అఫ్తాబ్‌కు మరో యువతితో అక్రమ సంబంధం ఉందని శ్రద్ధాకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. రగిలిపోయిన అఫ్తాబ్ అతని ప్రియురాలు శ్రద్దాను తన దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. అయితే శ్రద్దా లొంగకపోవడంతో ఆమెను అంతం చెయ్యాడానికి అఫ్తాబ్ సిద్ధం అయ్యాడు.

దీని ప్రకారం 2022 మే 18వ తేదీన అఫ్తాబ్ అతని ప్రియురాలు శ్రద్దాను గొంతు కోసి చంపేశాడు. ఆ తరువాత పదునైన ఆయుధంతో ఆమె రెండు చేతులను ఒక్కొక్కటి 3 ముక్కలుగా, రెండు కాళ్లను ఒక్కొక్కటి 3 ముక్కలుగా, తల, ఆమె తొడలను 2 భాగాలుగా ఇలా ఆమె శరీరం మొత్తం 35 ముక్కలుగా నరికాడు.

ఆన్ లైన్ లో చికెన్ రోల్ ఆర్డర్ చేసిన శాడిస్టు

ఆన్ లైన్ లో చికెన్ రోల్ ఆర్డర్ చేసిన శాడిస్టు

శ్రద్ధాను హత్య చేసిన తరువాత అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో పడిన రక్తపు మరకలను శుభ్రం చేసేందుకు బ్లింకిట్ యాప్ ద్వారా రెండు హార్పిక్ టాయిలెట్ క్లీనర్‌లు, బాడీని కత్తిరించే కటింగ్ బోర్డు, అర లీటర్ గిండా షైన్‌ఎక్స్ గ్లాస్ క్లీనర్‌లు, గోద్రెజ్ ప్రొటెక్ట్ హ్యాండ్ వాష్ ఆర్డర్ చేసి వాటిని తెప్పించుకున్నాడు.

అదే రోజు రాత్రి అఫ్తాబ్ జొమాటో యాప్ ద్వారా చికెన్ రోల్‌ని తెచ్చుకుని శ్రద్దా శరీరం ముక్కలు ఉన్న చోటా హ్యాపీగా తిన్నాడు. హత్య జరిగిన మూడు రోజుల్లో ఆన్‌లైన్ యాప్స్ ద్వారా చాలా వాటర్ బాటిళ్లను తెప్పించుకున్నాడని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

గ్రైండర్ లో ఎముకలు పొడి చేసిన సైకో ప్రియుడు

గ్రైండర్ లో ఎముకలు పొడి చేసిన సైకో ప్రియుడు

మే 19వ తేదీన కొత్త ఫ్రిజ్ తీసుకొచ్చి ఫ్లాట్ లో పెట్టాడు. శ్రద్దాను హత్య చేసినట్లు ఎలాంటి సాక్ష్యాలు పోలీసులకు చిక్కకుండా చేసేందుకు ఆమె శరీర భాగాలను ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో, అటవి ప్రాంతంలో విసిరేశాడు. శ్రద్దా శరీరంలోని ఎముకలను గ్రైండర్ లో పొడి చేసి ఎక్కడంటే అక్కడ చిన్నచిన్న ఎముకలు, ఎముకల పౌడర్ విసిరిసినట్లు పోలీసులు చార్జ్ షీట్ లో వివరించారని వెలుగు చూసింది.

శ్రద్దా శరీరంలో ఎన్నిమక్కలు చిక్కాయంటే?

శ్రద్దా శరీరంలో ఎన్నిమక్కలు చిక్కాయంటే?

శ్రద్దా హత్యకు గురైన మూడు నెలల తరువాత శ్రద్దా తలను ముక్కలు ముక్కలు చేశాడని పోలీసులు అంటున్నారు. శ్రద్ధాతో తనకు ఉన్న శత్రుత్వం మరెవరికీ తెలియకూడదని ఆమె మొబైల్‌ని ముంబాయిలో విసిరేశాడని పోలీసులు అన్నారు. శ్రద్ధా శరీరంలోని 35 శరీర భాగాల్లోని 20 ముక్కలను తాము కనుగొన్నామని ఢిల్లీ పోలీసు అధికారులు కోర్టుకు సమర్పించిన చార్జ్ షీట్‌లో వివరించారని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+