Girlfriend: అక్రమ సంబంధం, ప్రియురాలి కోసం ఫేస్ బుక్ లో భార్య పరువు తీశాడు, చివరికి !

పూణే/చెన్నై: భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్న భర్త ఒక్కసారిగా ప్రియురాలిని సెట్ చేసుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు. భర్త అక్రమ సంబంధం విషయం అతని భార్యకు తెలిసిపోయింది. భర్త అక్రమ సంబంధం విఫయంలో గొడవలు జరగడంతో పెద్దలు పంచాయితీలు చేశారు. ఎవరు ఎన్ని చెప్పినా కుక్కతోక వంకరా అన్నట్లు భర్త అతని ప్రియురాలిని మాత్రం వదిలి పెట్టకుండా ఆమెతో ఎంజాయ్ చేశాడు. తన భార్య అడ్డు తొలగించుకోవాలని ఆమె భర్త ఆలోచించాడు. అంతే ప్రియురాలి సహాయంతో భార్య ఫోటోలు ఉపయోగించి సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు ప్రారంభించారు. భార్య ఫోటోలను ఆశ్లీలంగా చిత్రీకరించిన భర్త, అతని ప్రియురాలు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భార్య పేరుతో నకిలి అకౌంట్లు ప్రారంభించిన భర్త, ఆమె ప్రియురాలు అశ్లీల ఫోటోలు పోస్టు చెయ్యడంతో అవి వైరల్ అయ్యాయి. తన అశ్లీల ఫోటోలు సోషల్ మీడియాలో చూసిన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయిన భర్త, అతని ప్రియురాలి మీద పోలీసులు కేసు నమోదు చెయ్యడంతో కథ రసవత్తరంగా మారిపోయింది.

చక్కగా కాపురం చేసిన భర్త

చక్కగా కాపురం చేసిన భర్త

మహారాష్ట్రలోని పూణేలోని యార్వాడ ప్రాంతంలో రంజిత్, రమ్య (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. రమ్యను వివాహం చేసుకున్న తరువాత భార్యతో రంజిత్ చక్కగానే కాపురం చేశాడు. వీలు చిక్కినప్పుడు రంజిత్ అతని భార్య రమ్య కలిసి బయటకు వెళ్లి సంతోషంగా కాలం గడిపేవాడు.

పక్కింటి పుల్లకూర టేస్ట్ చూసిన భర్త

పక్కింటి పుల్లకూర టేస్ట్ చూసిన భర్త

పని మీద ఎక్కువగా బయట తిరుగుతున్న రంజిత్ చాందిని (ఆమె పేరు మార్చడం జరిగింది) అనే మహిళతో పరిచయం పెంచుకున్నాడు. చాలా కాలం నుంచి రంజిత్, చాందిని సీక్రేట్ గా కలుసుకున్నారు. భార్య రమ్యతో సంతోషంగా కాపురం చేస్తున్న భర్త రంజిత్ ఒక్కసారిగా ప్రియురాలు చాందినిని సెట్ చేసుకుని ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు. పక్కింటి పుల్లకూర చాలా రుచిగా ఉందని భర్త రంజిత్ మురిసిపోయాడు.

పంచాయితీలు పెట్టిన భార్య

పంచాయితీలు పెట్టిన భార్య


కొంత కాలానికి భర్త రంజిత్ అక్రమ సంబంధం విషయం అతని భార్య రమ్యకు తెలిసిపోయింది. భర్త రంజిత్ అక్రమ సంబంధం విషయంలో గొడవలు జరగడంతో పెద్దలు పంచాయితీలు చేశారు. ఎవరు ఎన్ని చెప్పినా కుక్కతోక వంకరా అన్నట్లు భర్త రంజిత్ అతని ప్రియురాలు చాందినిని మాత్రం వదిలి పెట్టకుండా ఆమెతో ఎంజాయ్ చేశాడు. భర్త తీరు మారకపోవడంతో రమ్య ఆవేదన చెందింది.

భర్త, కిలాడి గర్ల్ ఫ్రెండ్ స్కెచ్

భర్త, కిలాడి గర్ల్ ఫ్రెండ్ స్కెచ్

తన భార్య రమ్య అడ్డు తొలగించుకోవాలని ఆమె భర్త రంజిత్ ఆలోచించాడు. అంతే గత ఏడాది ప్రియురాలు చాందిని సహాయంతో భార్య రమ్య ఫోటోలు ఉపయోగించి సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు ప్రారంభించారు. భార్య రంజిత ఫోటోలను ఆశ్లీలంగా చిత్రీకరించిన భర్త రంజిత్, అతని ప్రియురాలు చాందిని ఆ అశ్లీల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

భార్య అశ్లీల ఫోటోలు వైరల్

భార్య అశ్లీల ఫోటోలు వైరల్

భార్య రమ్య పేరుతో కొన్ని నకిలి అకౌంట్లు ప్రారంభించిన భర్త రంజిత్, ఆమె ప్రియురాలు చాందిని అశ్లీల ఫోటోలు పోస్టు చెయ్యడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంట్లో భార్య రమ్యకు తెలీకుండా ఆమె వ్యక్తిగత ఫోటోలను భర్త రంజిత్ తీశాడని ఆరోపణలు ఉన్నాయి. అశ్లీల ఫోటోలతో పాటు అసభ్యంగా కంటెంట్ కూడా ఫోటోల కింద ఉండటంతో రమ్యకు తెలిసిన వాళ్లు ఆ విషయం గమనించి వెంటనే ఆమెకు సమాచారం ఇచ్చారు.

 గొడవలు చేసిన భర్త.... ఉరి వేసుకున్న భార్య

గొడవలు చేసిన భర్త.... ఉరి వేసుకున్న భార్య

నీ అశ్లీల ఫోటోలు నీ పేరుతో కొన్ని ఫేస్ బుక్ అకౌంట్ లోకి ఎలా వచ్చాయి అంటూ భర్త రంజిత్ అతని భార్య రమ్యతో కావాలనే గొడవ పెట్టుకున్నాడు. అవి నా ఫోటోలు కావని, ఎవరో ఇలా కావాలనే చేశారని రమ్య అతని భర్త రంజిత్ కు నచ్చచెప్పడానికి అనేక రకాలుగా ప్రయత్నించింది. తన అశ్లీల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, రోజు భర్త రంజిత్ గొడవ చెయ్యడంతో అతని భార్య రమ్య గత ఏడాది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

నా అల్లుడు, ప్రియుడే కారణం

నా అల్లుడు, ప్రియుడే కారణం

రమ్య ఆత్మహత్య చేసుకున్న తరువాత కూడా ఆమె పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లతో మరికొన్ని ఫోటోలు దర్శనం ఇచ్చాయి. చనిపోయిన కూతురి పేరుతో ఎలా ఇలాంటి అశ్లీల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని రమ్య కుటుంబ సభ్యులు, ఆమె బంధువులకు అనుమానం వచ్చింది. తన అల్లుడు రంజిత్, అతని ప్రియురాలు చాందిని మా అమ్మాయి అశ్లీల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని రమ్య తండ్రికి అనుమానం వచ్చింది.

కిలాడీ భర్త, చిత్రాంగి ప్రియురాలి మీద కేసు

కిలాడీ భర్త, చిత్రాంగి ప్రియురాలి మీద కేసు

తన అల్లుడు రంజిత్, ఆమె ప్రియురాలు చాందిని కలిసి తన కుమార్తె రమ్య ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించారని ఆరోపిస్తూ రమ్య తండ్రి గురువారం యార్వాడ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. రమ్య భర్త రంజిత్, అతని ప్రియురాలి మీద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. అక్రమ సంబంధం కారణంగా భార్య ఆత్మహత్య చేసుకోవడానికి ఆమె భర్త ఇంతటి దారుణమైన పని చేశాడని వెలుగు చూడటంతో పూణేలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+