వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏందిదీ.. మెటల్ హుక్స్ ఉందని, బ్రా విప్పివేయించారు.. 90 శాతం మంది, నీట్‌లో ఇలా

|
Google Oneindia TeluguNews

నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)పై దుమారం కొనసాగుతోంది. ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని తమిళనాడు గట్టిగా పట్టుబడుతుంది. ఆ వరసలో మిగతా రాష్ట్రాలు కూడా చేరుతున్నాయి. అయితే కేరళలో ఒక అనుహ్య ఘటన జరిగింది. అవును ఓ విద్యార్థిని చేదు అనుభవం ఎదురయ్యింది. ఓ విద్యార్థిని పరీక్ష హాల్‌లోకి వచ్చారు. అయితే 'బ్రా'కు మెటల్ హుక్స్ ఉన్నాయి. అవీ చెక్ చేసే సమయంలో బీప్ సౌండ్ వచ్చింది.

ఇంకేముంది సిబ్బంది బ్రాను విప్పమని బలవంతం చేశారు. దీంతో చేసేదేమీ లేక.. ఆమె బ్రా విప్పేసింది. తన తల్లికి ఇచ్చి పంపించింది. అయితే అప్పుడు పరీక్ష హాలులోనికి అనుమతించారు. తనకు కప్పుకోవడానికి శాలువా ఇవ్వాలని సదరు యువతి కోరారు. చదమంగళంలో గల మర్తొమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజీలో ఘటన జరిగింది. అయితే ఘటన గురించి యాజమాన్యం బాధ్యత వహించలేదు. కానీ పోలీసులు మాత్రం తమకు ఫిర్యాదు వచ్చిందని చెబుతున్నారు. ఆ బాలిక తండ్రి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Girls Allegedly Forced To Remove Underwear In NEET exam

తన కూతురు ఒక్కరే కాదు.. దాదాపు 90 శాతం మంది ఇలానే చేశారని ఆ యువతి తండ్రి చెప్పారు. ఇన్నర్స్ స్టోర్ రూమ్‌లో పెట్టారని తెలిపారు. దీంతో అభ్యర్థులు మానసిక ఆందోళనకు గురయ్యారని వివరించారు. మరొ అమ్మాయిని జీన్స్ విప్పేయాలని కోరారని తెలుస్తోంది. మెటల్, బటన్ ఉన్నందున విప్పేయాలని కోరారని సమాచారం. కానీ దీనిపై దుమారం రేగుతుంది. ఇదీ సరికాదని మేధావులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.

Girls Allegedly Forced To Remove Underwear In NEET exam
English summary
girl was asked by female security personnel to remove her bra because of the “metallic hook”. Traumatised, the student passed on the bra to her mother so she would be allowed to write the exam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X