రైల్లో గర్ల్స్‌పై వేధింపులు: ఐదుగురు పోలీసుల సస్పెన్షన్

Girls harassed in Patna train
పాట్నా: బీహార్ రాష్ట్రంలోని పాట్నా రైల్వే స్టేషన్‌లో సోమవారం రైలులో ప్రయాణిస్తున్న 93మంది పాఠశాల విద్యార్థినులపై వేధింపులకు పాల్పడిన కొందరు యువకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు రైల్వే పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రైల్వే పోలీస్ సూపరింటెండెంట్ ఉపేందర్ కుమార్ సిన్హా మాట్లాడుతూ.. సబ్ ఇన్‌స్పెక్టర్ తోపాటు ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

సస్పెన్షన్ తర్వాత వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఉపేందర్ కుమార్ సిన్హా తెలిపారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే ధన్‌బాద్‌లో శనివారం నిర్వహించిన ఓ పరీక్ష కోసం హాజరైన కొందరు యువకులు పాట్నాలో స్టేషన్‌లో ఆగిన గంగా దామోదర్ ఎక్స్‌ప్రెస్‌లో బాలికలకు రిజర్వు చేసిన సీట్లలో కూర్చున్నారు. అదే సమయంలో పాట్నాలో రెండు రోజుల ఎడ్యుకేషనల్ టూర్ ముగించుకున్న ధన్‌బాద్, దిగ్వండిహ్‌ల్లోని కార్మెల్ పాఠశాలలకు చెందిన 9 నుంచి 12 తరగతి విద్యార్థులు, ఐదుగురు టీచర్లతోపాటు పాట్నా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.

బాలికలకు కేటాయించిన సీట్లలో కూర్చున్న ఆ యువకులను లేవాలని అక్కడికి చేరుకున్న పాఠశాల టీచర్లు కోరారు. అయితే ఆ యువకులు సీట్లను ఖాళీ చేయకపోగా పాఠశాల విద్యార్థులు, టీచర్లపై వేధింపులకు, దూషణలకు పాల్పడ్డారు. కాగా రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, యువకులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పాఠశాల టీచర్లు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

అదే పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థులు బుక్ చేసుకున్న మరో బోగీలో ఎక్కి ధన్‌బాద్‌కు చేరుకున్నామని టీచర్లు తెలిపారు. బాలికలు, టీచర్ల వాదనలను వినేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ధన్‌బాద్‌కు పంపించినట్లు ఉపేందర్ కుమార్ సిన్హా తెలిపారు. కాగా ఈ విషయంపై స్పందించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెంటనే విచారణ ప్రారంభించాలని రైల్వే డిజిపి పిఎన్ రావుకు ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+