Girls: విద్యార్థుల మీద లైంగిక దాడి చేశారని ఫేమస్ మఠాధిపతి మీద ఫోక్స్ కేసు, కలకలం !
బెంగళూరు/మైసూరు: కర్ణాటకలో ఎంతో పేరు ప్రతిష్టలు సంపాధించుకున్న చిత్రదుర్గాలోని మురుగా మఠం మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు మీద లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం కలకలం రేపింది. మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరుతో పాటు మరో ఇద్దరి మీద ఫోక్స్ చట్టం కింద కేసులు నమోదు కావడం కర్ణాటకలో కలకలం రేపింది. కర్ణాటకలోని ప్రముఖ మఠాలు, మఠాధిపతుల్లో డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు ఒక్కరు కావడం విశేషం. తమ మీద స్వామీజీ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఇద్దరు అమ్మాయిలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు హాట్ టాపిక్ అయ్యింది.

ఇద్దరు అమ్మాయిల మీద లైంగిక దాడి ?
కర్ణాటకలోని చిత్రదుర్గాలోని మురుగా మఠానికి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఎంతోకాలంగా ఎంతో పేరుప్రతిష్టలు సంపాధించుకున్న చిత్రదుర్గాలోని మురుగా మఠం మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు ఇద్దరు అమ్మాయిల మీద పదేపదే లౌంగిక దాడికి పాల్పడ్డారని ఓ స్వచ్చంద సంస్థ నిర్వహకులు మైసూరులోని నజరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.

పోలీసులకు ఫిర్యాదు
డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు స్వామీజీ ఇద్దరు అమ్మాయిల్లో ఓ అమ్మాయి మీద మూడు సంవత్సరాల నుంచి, మరో అమ్మాయి మీద 18 నెలల నుంచి లైంగిక దాడికి పాల్పడుతున్నారని ఆ స్వచ్చంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు అమ్మాయిల మీద లైంగిక దాడి చెయ్యడానికి ఆ మఠంలోనే ఉంటున్న కొందరు సహకరించారని స్వచ్చంద సంస్థ నిర్వహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

స్వామీజీ, లేడీ వార్డన్, లాయర్ తో సహ ఐదు మంది
మొదటి ముద్దాయి కాగా రెండో ముద్దాయిగా వార్డెన్ రశ్మీ, మఠం మరిస్వామి అలియాస్ బసవాధిత్య, లాయర్ గంగాధరయయ, లీడర్ పరమశివయ్య స్వామీజీ ఆగడాలకు సహకరిస్తున్నారని, వారి మీద చర్యలు తీసుకోవాలని అమ్మాయిల తరపున స్వచ్చంద సంస్థ నిర్వహకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మనవి చేశారని సమాచారం.

స్వచ్చంద సంస్థ ఆధీనంలో అమ్మాయిలు
ప్రముఖ చిత్రదుర్గాలోని ప్రముఖ మఠం అయిన మురుగా మఠం మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు స్వామీజీ మీద ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు కావడం కలకలం రేపింది. కర్ణాటకలోని ప్రముఖ మఠాలు, మఠాధిపతుల్లో డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు ఒక్కరు కావడం విశేషం. చిత్రదుర్గాలోని మురుగా మఠానికి నిత్యం వేలాది మంది భక్తులు వెళ్లి వస్తుంటారు. మఠం ఆధీనంలో అక్కమ్మదేవి విద్యాసంస్థలు ఉన్నాయి.

టెన్షన్ గా ఎదురు చూస్తున్న కన్నడిగులు
తమ మీద స్వామీజీ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఇద్దరు అమ్మాయిలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు హాట్ టాపిక్ అయ్యింది. అయితే స్వామీజీ మీద కావాలనే కొందరు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారని ఆ మఠానికి చెందిన భక్తులు ఆరోపిస్తున్నారు. అయితే మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు స్వామీజీ మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ? అంటూ కన్నడిగులు టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications