మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహన్ పై సినీనటుడు నానాపటేకర్ ఫైర్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ప్రముఖ నటుడు నానాపటేకర్ హెచ్చరించారు. మధ్యప్రదేశ్ లోని మాందాసౌర్ లో బుధవారం రైతులపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు.
ముంబై:మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ప్రముఖ నటుడు నానాపటేకర్ హెచ్చరించారు. మధ్యప్రదేశ్ లోని మాందాసౌర్ లో బుధవారం రైతులపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు.
రైతుల ఆగ్రహానికి గురికావొద్దని సీఎంకు సూచించారు. రైతుల డిమాండ్లను పరిష్కరించి వారు ఆందోలన విరమించేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలా కాకుండా పోలీస్ చర్యలతో రైతులను అణిచివేయాలని చూస్తే పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందన్నారు.

వారిని అణిచివేసేందుకు ప్రయత్నించడం కంటే వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేయాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ను నానాపటేకర్ కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని మాందాసౌర్ లో ధర్నాచేస్తున్న రైతులపై అక్కడి పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే












Click it and Unblock the Notifications