మీకు నిద్రలేని రాత్రులిచ్చాం..పాక్ ప్రధానికి మోడీ ఘాటు కౌంటర్..!
పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్ గా పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలతో పాటు కీలకమైన రక్షణ స్థావరాలు, ఎయిర్ బేస్ లను సైతం భారత్ దెబ్బతీసింది. అయితే ఇందులో బ్రహ్మోస్ క్షిపణులు కీలక పాత్ర పోషించాయి. వీటి గొప్పతనాన్ని తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఆంగీకరించారు. తాము భారత్ పై దాడి చేసేలోపే బ్రహ్మోస్ తో ఆ దేశం తమపై దాడి చేసేసిందని వాపోయారు. దీనిపై భారత ప్రధాని మోడీ స్పందించారు.
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కామెంట్స్ ను గుర్తుచేస్తూ ఆ దేశానికి తాము బ్రహ్మోస్ తో నిద్రలేని రాత్రులు ఇచ్చామని ప్రధాని మోడీ గుర్తుచేసారు. ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో 50 వేల కోట్ల విలువైన ఇన్ ఫ్రా ప్రాజెక్టుల్ని ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని మోడీ.. పాకిస్తాన్ తో జరిగిన ఆపరేషన్ సింధూర్ ను గుర్తుచేశారు. పాకిస్తాన్ లోపలికి వందల మైళ్లు చొచ్చుకుని వెళ్లి మరీ ఉగ్రవాద శిబిరాలను తాము ధ్వంసం చేసామని ప్రధాని తెలిపారు.

#WATCH | Kanpur, UP: Prime Minister Narendra Modi says, " We entered their (terrorists) camps and destroyed the terror sites in Pakistan. Our Armed Forces showed such courage that the Pakistan Army ended up begging to stop the war...I want to tell enemies who begged us to stop… pic.twitter.com/jqEQga4vgR
— ANI (@ANI) May 30, 2025
మన సాయుధ దళాల వీరోచిత చర్యలతో పాక్ సైన్యాన్ని యుద్ధాన్ని ఆపమని వేడుకోవలసి వచ్చిందని ప్రధాని మోడీ గుర్తుచేశారు. ఆపరేషన్ సిందూర్ భారతదేశ సైనిక శక్తిని ప్రపంచానికి ప్రదర్శించిందని ప్రకటించారు. అలాగే బ్రహ్మోస్ క్షిపణిపై ప్రత్యేకంగా ప్రశంసల జల్లు కురిపించారు. బ్రహ్మోస్ పాక్ కు నిద్రలేని రాత్రులు ఇచ్చిందన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయాలపై ఇప్పటికే గుజరాత్, బీహార్ లో పలుమార్లు ప్రస్తావించిన ప్రధాని మోడీ ఇవాళ కాన్పూర్ లోనూ అవే విషయాల్ని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ విజయాల్ని ప్రధాని ఆర్మీ నుంచి తమ ఖాతాలోకి వేసుకుంటున్నారన్న విపక్షాల విమర్శల నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
-
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications