సంచలనం: పాక్‌ను ఖండ ఖండాలుగా నరకాలి: సుబ్రమణ్యస్వామి

న్యూఢిల్లీ: కుల్‌భూషణ్ జాదవ్ కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా అవమానించిన పాకిస్తాన్‌ను ఖండ ఖండాలుగు తెగ నరకాలని బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రం పాకిస్థాన్‌పై యుద్దం చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు.

పాకిస్తాన్‌ జైలులో మగ్గుతున్న కుల్‌భూషణ్‌ జాధవ్‌ను కలిసేందుకు వెళ్లిన ఆయన తల్లి అవంతి, భార్య చేతాంకుల్‌లకు జరిగిన అవమానంపై రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్‌ స్వామి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

 Go to war with Pakistan, tear it to pieces, says Subramanian Swamy on Kulbhushan Jadhav row
ఈ సంఘటనను ద్రౌపది వస్త్రపాహరణంగా సుబ్రమణియన్‌ స్వామి అభిప్రాయపడ్డారు.జాధవ్‌ కుటుంబాన్ని అవమానించిన పాకిస్తాన్‌ గడ్డను ఖండఖండాలుగా తెగ నరకాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టాలని సూచించారు.

అయితే ఇదంతా తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. వాస్తవాధీన రేఖ అవల భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే, పాకిస్తాన్‌కు ఇది సరిపోదని, దాన్ని నాలుగు ముక్కలుగా విభజించడమే రక్త దాహాన్ని ఆపగలుగుతుందని అభిప్రాయపడ్డారు.

భారత్‌ - పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం వస్తే మరే ఇతర దేశం కూడా అందులో జోక్యం చేసుకోదని అన్నారు. ఇందుకు కారణం అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌పై ఉన్న ముద్రేనని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+